ETV Bharat / international

యూనివర్సిటీలో కాల్పుల కలకలం- ఆరుగురు మృతి - రష్యా కాల్పులు

gun
కాల్పులు
author img

By

Published : Sep 20, 2021, 1:41 PM IST

Updated : Sep 20, 2021, 10:04 PM IST

13:37 September 20

యూనివర్సిటీలో కాల్పుల కలకలం- ఆరుగురు మృతి

రష్యా పెర్మ్‌లోని యూనివర్సిటీలో (Perm University shooting) సోమవారం కాల్పుల మోత (Russia Shooting) మోగింది. ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఆరుగురు మృతి చెందారు. ఆరు నుంచి 14 మంది వరకు గాయపడినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు.

గుర్తు తెలియని వ్యక్తి క్యాంపస్​లోకి ప్రవేశించి విద్యార్థులపై కాల్పులు (Perm University shooting) జరిపినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో భవనాల్లోని విద్యార్థులు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. కాల్పుల (Perm University shooting) నుంచి తప్పించుకోవడానికి కొందరు విద్యార్థులు కిటికీల్లోంచి దూకి పారిపోయారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

క్యాంపస్​కు చెందిన ఓ విద్యార్థే ఈ కాల్పులకు (Perm University shooting) తెగబడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. దాడి (Russia Shooting) చేయడానికి గల కారణాలు తెలియరాలేదు.

రబ్బర్, ప్లాస్టిక్ బుల్లెట్లు కాల్చే తుపాకీతో సాయుధుడు ఈ దాడి చేశాడని పెర్మ్ యూనివర్సిటీ (Perm University news) తెలిపింది. తుపాకీని నిజమైన బుల్లెట్లు కాల్చేలా మార్చే అవకాశం ఉందని పేర్కొంది. క్యాంపస్​ను విడిచి వెళ్లే అవకాశం ఉన్న విద్యార్థులు వెళ్లిపోవాలని సూచించింది. (Perm University attack)

భారతీయులు క్షేమం

ఘటనపై రష్యాలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. భారతీయ విద్యార్థులందరూ క్షేమంగానే ఉన్నారని స్పష్టం చేసింది. స్థానిక అధికారులు, భారతీయ విద్యార్థుల ప్రతినిధులతో సంప్రదింపులు కొనసాగిస్తున్నట్లు తెలిపింది. ఘటనలో విద్యార్థులు మరణించడం బాధాకరమని, క్షతగాత్రులు వెంటనే కోలుకోవాలని ఆకాంక్షించింది.

ఇదీ చదవండి: బోటు ప్రమాదంలో 10 మంది దుర్మరణం

Last Updated : Sep 20, 2021, 10:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.