ETV Bharat / state

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా విశ్రాంత ఐఏఎస్ పార్థసారథి - తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్

partha sarathy
partha sarathy
author img

By

Published : Sep 8, 2020, 4:36 PM IST

Updated : Sep 8, 2020, 7:10 PM IST

16:35 September 08

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా విశ్రాంత ఐఏఎస్ అధికారి పార్థసారథి

రాష్ట్ర ఎన్నికల కమిషనర్​గా విశ్రాంత ఐఏఎస్ అధికారి పార్థసారథి నియమితులయ్యారు. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర తొలి ఎన్నికల కమిషనర్​గా పనిచేసిన నాగిరెడ్డి ఇటీవల పదవీవిరమణ చేశారు. అప్పట్నుంచి ఆ పదవి ఖాళీగా ఉంది. ఇప్పుడు ఆ స్థానంలో విశ్రాంత ఐఏఎస్ అధికారిని పార్థసారథిని ప్రభుత్వం నియమించింది.

1988లో ఆర్డీఓగా విధుల్లో చేరిన పార్థసారథికి 1991లో ఐఏఎస్​గా పదోన్నతి వచ్చింది. అప్పట్నుంచి వివిధ హోదాల్లో పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కరీంనగర్ కలెక్టర్​గా, మార్కెఫెడ్ ఎండీగా, సమాచార-పౌరసంబంధాల కమిషనర్​గా పనిచేశారు.

రాష్ట్ర పర్యావరణ పరిరక్షణ, శిక్షణ, పరిశోధనా సంస్థ (ఈపీటీఆర్‌ఐ) డైరెక్టర్‌ జనరల్​గా సేవలందించారు. తెలంగాణ విశ్వవిద్యాలయం, ఉద్యాన వర్శిటీలకు ఇంఛార్జీ ఉపకులపతిగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం పౌరసరఫరాల శాఖ కమిషనర్​గా, వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. ముఖ్యకార్యదర్శి హోదాలో ఇటీవలే పదవీ విరమణ చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్​గా ఆయన మూడేళ్ల పాటు బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

Last Updated : Sep 8, 2020, 7:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.