మావోయిస్టులకు గిరిజనుల్లో ఆదరణ కరవైందని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. గిరిజన ప్రాంతాల్లోని ప్రజల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తోందని చెప్పారు. ఏవోబీ సరిహద్దులో ఆరుగురు మావోయిస్టులు లొంగిపోయిన నేపథ్యంలో.. అమరావతిలో డీజీపీ మాట్లాడారు.
గాజర్ల రవి అలియాస్ ఉదయ్ సహా ఐదుగురు మావోయిస్టులు లొంగిపోయినట్లు ఆయన ప్రకటించారు. మావోయిస్టులకు గిరిజనుల్లో ఆదరణ కరవైందన్నారు. గత రెండేళ్లుగా గిరిజనులకు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. గిరిజనులకు 3 లక్షల ఎకరాలను ప్రభుత్వం పంపిణీ చేసిందని.. సుమారు 20 వేల మందికి పట్టాలు ఇచ్చిందని తెలిపారు.
DGP Mahender reddy: 'తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం'