ETV Bharat / state

Congress: హుజూరాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా కొండా సురేఖ దాదాపు ఖరారు! - తెలంగాణ వార్తలు

Congress candidate, huzurabad by poll
హుజూరాబాద్ ఉప ఎన్నిక, కాంగ్రెస్ అభ్యర్థి నివేదిక పూర్తి
author img

By

Published : Aug 21, 2021, 11:46 AM IST

Updated : Aug 21, 2021, 3:59 PM IST

11:45 August 21

Congress: హుజూరాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా కొండా సురేఖ దాదాపు ఖరారు!

హుజూరాబాద్‌ ఉపఎన్నికల బరిలో కాంగ్రెస్‌(congress) అభ్యర్థి ఎంపికపై కసరత్తు దాదాపు పూర్తికావొచ్చింది. అన్ని సామాజిక, ఆర్థిక సమీకరణాల దృష్ట్యా కొండా సురేఖ అభ్యర్థిత్వం దాదాపు ఖరారైందని తెలుస్తోంది. సోనియా ఆమోదంతో ఒకట్రెండురోజుల్లో కొండా సురేఖ పేరును అధికారికంగా ప్రకటించనున్నారు. అభ్యర్థి ఎంపికపై ఎన్నికల కమిటీ ఛైర్మన్‌ దామెదర రాజనర్సింహ ఎస్సీ, బీసీ, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులను పేర్లతో పీసీసీ(PCC) అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డికి నివేదిక ఇచ్చారు. నివేదికతో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మాణికం ఠాగూర్‌ నేడు దిల్లీకి వెళ్లనున్నారు. అధిష్ఠానం పచ్చజెండా ఊపగానే అభ్యర్థి పేరు ప్రకటించనున్నారు. 

దామోదర రాజనర్సింహ ఇచ్చిన నివేదికలో కొండా సురేఖ(konda surekha) పేరు ఉన్నట్లుగా సమాచారం. హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖ అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. సోనియా ఆమోదంతో ఒకటి, రెండు రోజుల్లో కొండా సురేఖ పేరును ప్రకటించే అవకాశం ఉందని పీసీసీ వర్గాలు వెల్లడించాయి.

గత ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థిగా కౌశిక్​ రెడ్డి పోటీ చేశారు. అయితే మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో హుజూరాబాద్‌ టికెట్‌ తనకే వస్తుందని కౌశిక్​ రెడ్డి ఓ కార్యకర్తతో ఫోన్‌లో జరిపిన సంభాషణ సంచలనం సృష్టించింది. మాదన్నపేటకు చెందిన విజయేందర్‌ అనే కార్యకర్తతో కౌశిక్‌రెడ్డి ఫోన్​లో మాట్లాడుతూ.. హుజూరాబాద్‌ తెరాస టికెట్‌ తనకే ఖాయమైనట్లు చెప్పారు. యువతకు ఎంత డబ్బు కావాలో తాను చూసుకుంటానని..  ప్రస్తుతం వారి ఖర్చులకు ఒక్కొక్కరికీ రూ.4-5వేలు ఇస్తానని అతడికి తెలిపారు. ఈ ఫోన్​ సంభాషణ సోషల్​ మీడియాలో వైరల్​గా మారటంతో కాంగ్రెస్​ కౌశిక్​ రెడ్డికి షోకాజ్​ నోటీసులు ఇచ్చింది. 24 గంటల్లో వివరణ ఇవ్వాలని తెలిపింది. దీంతో కౌశిక్​ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం సీఎం కేసీఆర్​ సమక్షంలో తెరాసలో చేరారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో తెరాస టికెట్‌ ఆశించినప్పటికీ.. ఆ స్థానాన్ని బీసీకి ఇవ్వాలని నిర్ణయించినందున కౌశిక్‌రెడ్డికి  నామినేటెడ్‌ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. 

ఇదీ చదవండి: KISHAN REDDY: 'జనవరి నుంచి పర్యాటక రంగాన్ని పునః ప్రారంభిస్తాం'

Last Updated : Aug 21, 2021, 3:59 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.