ETV Bharat / state

నా దగ్గర డబ్బులు లేవు - ఎక్కడైనా ఉన్నట్టు చూపిస్తే మీకే ఇచ్చేస్తా : బీఆర్ఎస్ ఎమ్మెల్యే భాస్కర్ రావు - మిర్యాలగూడలో ఐటీ సోదాలు

IT Raids On BRS MLAs
IT Raids
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 16, 2023, 8:17 AM IST

Updated : Nov 16, 2023, 12:33 PM IST

08:10 November 16

బీఆర్ఎస్ ఎమ్మెల్యే భాస్కర్ రావు ఇంట్లో అధికారుల సోదాలు

నా దగ్గర డబ్బులు లేవు - ఎక్కడైనా ఉన్నట్టు చూపిస్తే మీకే ఇచ్చేస్తా : బీఆర్ఎస్ ఎమ్మెల్యే భాస్కర్ రావు

IT Raids On BRS MLAs in Telangana Today : రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల వేళ మరోసారి ఐటీ దాడులు (IT Raids in Telangana ) కలకలం రేపుతున్నాయి. తాజాగా హైదరాబాద్, నల్గొండ, మిర్యాలగూడలో సోదాలు జరుగుతున్నాయి. మిర్యాలగూడ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు ఇంట్లో ఆదాయపన్ను శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మిర్యాలగూడలో వైదేహీనగర్‌లోని ఎమ్మెల్యే బంధువు.. కాంట్రాక్టర్, స్థిరాస్తి వ్యాపారి ఇంజం శ్రీధర్ ఇంట్లో సోదాలు చేస్తున్నారు.

IT Raids in BRS MLA Nallamothu Bhaskar Rao : తెల్లవారుజామున 4 గంటల నుంచే మొత్తం 40 బృందాలు ఏకకాలంలో సోదాలు నిర్వహించగా.. 30 బృందాలు ఒక్క నల్గొండలోనే దాడులకు దిగడం గమనార్హం. ప్రస్తుతం మిర్యాలగూడ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నల్లమోతు భాస్కర్‌ రావుకు (MLA Nallamothu Bhaskar Rao) దేశవ్యాప్తంగా వ్యాపారాలున్నట్లు సమాచారం. పలు పవర్​ప్లాంట్లలో ఆయన పెట్టుబడులు కూడా పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే భారీగా డబ్బులు నిల్వ చేశారనే ఆరోపణలతో.. అధికారులు తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే భాస్కర్ రావు బంధువులు, అనుచరుల ఇండ్లలోనూ ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు.

Bangalore IT Raid Today : ఎన్నికల ఎఫెక్ట్​.. కార్పొరేటర్ల ఇళ్లల్లో IT సోదాలు​.. మంచం కింద రూ.42 కోట్లు చూసి షాక్​!

IT Raids in Telangana Today : రైస్‌మిల్ యజమానులు రంగా శ్రీధర్, రంగా రంజిత్, బండారు కుశలయ్య ఇళ్లలో ఐటీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. త్రిపురారం మండలం ముకుందాపురం సాల్వెంట్ ఆయిల్ మిల్లులో, నిడవునూరు మండలంలోని శాఖాపురంలో గల భాస్కర్ నివాసంలో కూడా సోదాలు జరుపుతున్నారు. అదేవిధంగా నల్గొండలోని రవీందర్‌నగర్, పాతబస్తీలోనూ దాడులు నిర్వహిస్తున్నారు. మహేంద్ర ఆయిల్ మిల్ యజమాని కందుకూరు మహేందర్ ఇంటితో పాటు.. ఆయనకు చెందిన రైస్ మిల్లు, మరో 7 చోట్ల సోదాలు చేపట్టారు. నల్గొండ రైస్ మిల్లర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడి ఇంట్లోనూ.. హాలియాలోని చిట్టిపోలు యాదగిరి ఇంట్లో, అనుములలోని వజ్రతేజ రైస్ మిల్లులోనూ సోదాలు కొనసాగుతున్నాయి.

Nallamothu Bhaskar Rao Respond on IT Raids : వేములపల్లిలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌ రావు.. ఐడీ దాడులపై స్పందించారు. తన బంధువులు, అనుచరుల ఇళ్లలో ఆదాయపన్ను శాఖ సోదాలు జరగలేదని చెప్పారు. ఐటీ అధికారులు ఎవరూ తనను కలవలేదని అన్నారు. రైస్ మిల్లులపైనే దాడులు జరుగుతున్నాయని.. రైస్ మిల్లర్లకు, తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. వారితో ఎలాంటి లావాదేవీలు లేవని తెలిపారు. కుట్రలో భాగంగానే తనపై ప్రతిపక్షాల ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఎన్నికల్లో గెలవలేక ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తనకు ఎలాంటి కంపెనీలు లేవని.. తన దగ్గర డబ్బులు కూడా లేవని.. ఎక్కడైనా చూపిస్తే మీకే ఇచ్చేస్తానని ఎమ్మెల్యే భాస్కర్‌ రావు వ్యాఖ్యానించారు.

IT Raids in Hyderabad : హైదరాబాద్‌లో మరోసారి ఐటీ సోదాల కలకలం

IT Raids on Congress Leaders Houses in Hyderabad : ఇటీవలే పలువురు కాంగ్రెస్ నాయకుల ఇళ్లలో ఐటీ అధికారులు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఖమ్మంలోని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నివాసానికి చేరుకున్న ఆదాయపన్ను శాఖ అధికారుల బృందం.. ఏకకాలంలో పొంగులేటి నివాసాలు, కార్యాలయాలపై మూకుమ్మడిగా తనిఖీలు చేశారు. తదుపరి విచారణ కోసం హైదరాబాద్‌ రావాలని.. పొంగులేటి కుటుంబీకులకు ఆదాయపన్ను శాఖ అధికారులు సూచించారు. హైదరాబాద్‌లో పలువురు కాంగ్రెస్‌ నాయకుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు (IT Raids in Telangana) చేపట్టారు. మహేశ్వరం హస్తం పార్టీ అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డితో పాటు బడంగపేట్‌ మేయర్‌ పారిజాత నర్సింహ్మారెడ్డి (Parijatha Narsimha Reddy) ఇళ్లలో దాడులు నిర్వహించారు.

హైదరాబాద్‌లో మరోసారి ఐటీ దాడుల కలకలం - ప్రముఖ ఫార్మా కంపెనీ డైరెక్టర్ల ఇళ్లల్లో సోదాలు!

IT Raids in Hyderabad : బీఆర్​ఎస్ ఎమ్మెల్యేల ఇళ్లలో మూడో రోజూ ఐటీ సోదాలు

Last Updated : Nov 16, 2023, 12:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.