రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపుపై రాష్ట్ర హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించడం లేదంటూ భాజపానేత ఇంద్రసేనారెడ్డి దాఖలు చేసిన పిల్‌పై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది.
నిర్మాణాలు పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించడం లేదని పిటిషనర్ పేర్కొన్నారు. పేదల కోసం నిర్మించిన ఇళ్లు దెబ్బతింటున్నాయని పిటిషన్లో వివరించారు. దీనివల్ల వేలకోట్ల ప్రజాధనం వృథా అవుతోందని పిటిషనర్ తెలిపారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో చర్చ
రాష్ట్ర వ్యాప్తంగా రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం(Vemula at TS Council) దాదాపుగా పూర్తి కావొస్తుందని.. ఇళ్ల స్థలాలు ఉన్న వారికి ఇళ్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో ఇళ్ల స్థలాలు ఉన్న వారికి ఆర్థిక సాయంపై కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి:
Vemula at TS Council: డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు.. కేంద్రం ఇచ్చేది 14శాతం మాత్రమే!: