ETV Bharat / bharat

ఉత్తర్​ప్రదేశ్​ మాజీ సీఎం కల్యాణ్​ సింగ్​ కన్నుమూత - కల్యాణ్​ సింగ్​

CM Kalyan Singh
కల్యాణ్​ సింగ్​
author img

By

Published : Aug 21, 2021, 9:49 PM IST

Updated : Aug 21, 2021, 10:45 PM IST

21:47 August 21

ఉత్తర్​ప్రదేశ్​ మాజీ సీఎం కల్యాణ్​ సింగ్​ కన్నుమూత

ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం, భాజపా సీనియర్​ నేత కల్యాణ్‌సింగ్‌(89) కన్నుమూశారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో గత కొన్నాళ్లుగా బాధపడుతున్న ఆయన.. లఖ్‌నవూలోని సంజయ్‌గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస(Kalyan Singh news) విడిచారు.

దేశ రాజకీయాల్లో కల్యాణ్​సింగ్​ది కీలక పాత్ర. ఉత్తరప్రదేశ్‌కు రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశారు. అటు రాజస్థాన్​ గవర్నర్​గానూ సేవలందించారు. భారతీయ జనతా పార్టీలో కీలకమైన నేతగా ఎదిగారు. 1992లో బాబ్రీ మసీదు ఘటన సమయంలో యూపీ సీఎంగా ఉన్నది ఆయనే. రెండుసార్లు పార్లమెంటు సభ్యుడిగానూ ఎన్నికయ్యారు.

కల్యాణ్​సింగ్​ మృతిపట్ల ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కల్యాణ్​​ సింగ్​ గొప్ప రాజనీతిజ్ఞుడు మాత్రమే గాక మంచి అడ్మినిస్ట్రేటర్​ అని కొనియాడారు. క్షేత్రస్థాయి రాజకీయాల్లో ఆయన తనదైన ముద్ర వేసినట్లు తెలిపారు. ఉత్తర్​ప్రదేశ్​ అభివృద్ధి ప్రస్థానంలో కల్యాణ్​ సింగ్​ది కీలక పాత్ర అని పేర్కొన్నారు. సమాజంలో అణగారిన వర్గాల ప్రజలకు ఆయన గొంతుకగా నిలిచినట్లు కొనియాడారు. రైతులు, యువకులు,మహిళల సాధికారత కోసం ఆయన కృషి చేసినట్లు మోదీ వివరించారు.

కల్యాణ్​ సింగ్​ మరణవార్త పట్ల ఉపరాష్ట్రపతి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం ఓ గొప్పనాయకుడిని, జాతీయవాదిని కోల్పోయిందని అన్నారు.  ప్రజాసేవకు అంకితమైన వ్యక్తిగా కల్యాణ్​సింగ్​ను అభివర్ణించారు వెంకయ్య. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.

23న అంత్యక్రియలు..

శనివారం రాత్రి తుదిశ్వాస విడిచిన కల్యాణ్​ సింగ్​ అంత్యక్రియలు ఈ నెల 23న ఉత్తర్​ప్రదేశ్ నరోరాలోని​ గంగా నదీ ఒడ్డున జరగనున్నాయి. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ ప్రకటించారు. మూడు రోజుల పాటు సంతాప దినాలు పాటించనున్నట్టు, ఆగస్టు 23న సెలవు దినంగా ప్రకటించారు యోగి. 

Last Updated : Aug 21, 2021, 10:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.