ETV Bharat / city

Rythu bandhu latest news: అన్నదాతకు శుభవార్త.. ఈ నెల 28 నుంచి రైతుబంధు.. - rythu bandhu telangana

Distribution of raithu bandhu from 28th of December in Telangana

author img

By

Published : Dec 18, 2021, 6:40 PM IST

Updated : Dec 18, 2021, 7:15 PM IST

18:39 December 18

Rythu bandhu latest news: అన్నదాతకు శుభవార్త.. ఈ నెల 28 నుంచి రైతుబంధు..

Rythu bandhu latest news: యాసంగికి సంబంధించిన రైతుబంధు పంపిణీపై అన్నదాతకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఈ నెల 28 నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు జమ చేయనుంది. పంపిణీ ప్రారంభించిన 10 రోజుల్లోనే అందరికీ నగదు జమ చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. గతంలోలానే ఎకరం నుంచి మొదలుకుని అందరికీ నగదు జమ చేయనుంది.

రుణం తీసుకుని రైతులకు పంపిణీ..

rythu bandhu telangana 2021: ఇందుకు సంబంధించి అవసరమైన మొత్తాన్ని ప్రభుత్వం సమీకరిస్తోంది. వానాకాలం పంటకు 7 వేల 377 కోట్ల రూపాయలను రైతుబంధు సాయంగా అందించారు. యాసంగి సీజన్‌కు కూడా దాదాపుగా అంతే మొత్తం అవసరం పడనుంది. అందుకు అవసరమైన నగదును సమకూర్చుకునే పనిలో ప్రభుత్వం పడింది. పన్నులు, ఇతర మార్గాల ద్వారా వచ్చే ఆదాయంతో పాటు కొంత మొత్తాన్ని రుణంగా తీసుకొని రైతుబంధు సాయాన్ని అందించనున్నారు.

నిరుడు ఇచ్చినట్టే..

rythu bandhu news december 2021: ఈ నెల మొదట్లోనే 1500 కోట్ల రూపాయలు రుణంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో రూ.2 వేల కోట్లు అప్పుగా తీసుకునేందుకు సిద్దమైంది. ఈ మేరకు ఆర్థికశాఖ 11 ఏళ్ల కాలపరిమితికి బాండ్లను జారీ చేసింది. రిజర్వ్ బ్యాంకు ద్వారా వీటిని వేలం వేసి రుణం తీసుకోనున్నారు. అవసరమైతే తరువాత కూడా మరికొంత మొత్తాన్ని అప్పుల ద్వారా సమకూర్చుకోనున్నారు. నిరుడు డిసెంబర్ 27న రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతుబంధు సాయాన్ని జమచేశారు. తక్కువ భూవిస్తీర్ణం ఉన్న వారితో ప్రారంభించారు. అదే తరహాలో ఈసారి ఈ నెల 28 నుంచి రైతుబంధు సాయం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

ఇదీ చూడండి:

Last Updated : Dec 18, 2021, 7:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.