ఏపీలో కొత్తగా 43 కరోనా కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. మొత్తం బాధితుల సంఖ్య 1,930కి చేరింది. కరోనాతో ఇవాళ ముగ్గురు మృతి చెందగా.. మరణాల సంఖ్య 44కు చేరింది. కొవిడ్-19 నుంచి కోలుకుని 887 మంది డిశ్చార్జి అయ్యారని ఆరోగ్య శాఖ తెలిపింది. 999 మంది కరోనా బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించింది. గడచిన 24 గంటల్లో 8,388 నమూనాలను పరీక్షించామని ప్రకటించింది.
జిల్లాల వారీగా కొత్త కేసులు
- కృష్ణా జిల్లాలో 16 కరోనా పాజిటివ్ కేసులు
- చిత్తూరు జిల్లాలో 11 కేసులు
- కర్నూలు జిల్లాలో 6 కేసులు
- విశాఖ జిల్లాలో 5 కేసులు