Telangana Omicron Cases: తెలంగాణలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు చాపకింద నీరులా పెరిగిపోతున్నాయి. తాజాగా రాష్ట్రంలో మరో 7 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 62కు చేరుకుంది. ఈ 62 మంది ఒమిక్రాన్ బాధితుల్లో 46 మంది టీకా తీసుకోకపోవటం కొసమెరుపు.
ట్రావెల్ హిస్టరీ లేని ముగ్గురికి ఒమిక్రాన్ నిర్ధరణైనట్టు వైద్యశాఖ వెల్లడించింది. ఇప్పుడు ఈ వార్త చర్చనీయాంశంగా మారింది. ఇన్ని రోజులు బయటి దేశాల నుంచి వచ్చినవాళ్లకే ఒమిక్రాన్ నిర్ధరణ కాగా.. ఇప్పుడు ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేనివారిలోనూ వేరియంట్ గుర్తించటంతో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది.
ఇవీ చదవండి: