దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుతున్నా అండమాన్ నికోబార్ దీవిలో కొత్తగా ఒక్క కొవిడ్ కేసు కూడా నమోదు కాలేదు. అరుణాచల్ ప్రదేశ్లో గత నాలుగు రోజుల నుంచి ఒక్కరికీ వైరస్ సోకలేదని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.
అరుణాచల్ ప్రదేశ్లో ఇప్పటివరకు మొత్తంగా 16,842 మందికి వైరస్ సోకింది. ఇప్పటివరకు 16,784 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 99.65 శాతం ఉంది. మంగవారం నాటికి 4,11,947 కొవిడ్ టెస్టులు నిర్వహించారు.
పర్యటకులు వస్తున్నా...
అండమాన్ దీవులకు పర్యటకులు పెరుగుతున్నా ఆ ప్రాంతంలో కొవిడ్ కేసులు నమోదుకాకపోవడం గమనార్హం. 700-800 వరకు పర్యటకులు వస్తున్నా పరిస్థితి అదుపులో ఉందని ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఇదీ చదవండి:ప్రమాదంలో యువకుడు మృతి- పోలీసులపై దాడి