YSRCP Barriers For Chandrababu Ra Kadali Ra Program : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు నడయాడిన నేల గుడివాడలో టీడీపీ తలపెట్టిన "రా కదలి రా" సభ ఏర్పాట్లు ఉత్సాహంగా సాగుతున్నాయి. సభను విజయవంతం చేసేందుకు చుట్టపక్కల గ్రామాల నుంచి భారీగా కార్యకర్తలు, నేతలు సభా ప్రాంగణానికి చేరుతున్నారు. ఈ సభకు ముందుగా ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన స్వగ్రామం నిమ్మకూరులో తొలుత చంద్రబాబు దంపతులు పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించనున్నారు. అక్కడ సేవా కార్యక్రమాలు ప్రారంభించి, స్థానికులతో భేటీ కానున్నారు. అనంతరం గుడివాడలో 'రా కదలిరా ' సభలో చంద్రబాబు పాల్గొంటారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా శ్రేణులను సన్నద్దం చేసేంుకు టీడీపీ తలపెట్టిన ఈ సభను విజయవంతం చేసేందుకు పార్టీ కార్యకర్తలు, నేతలు నూతనోత్తేజంతో ముందుకు కదలనున్నాయి. స్థానిక నేతల ఇప్పటికే గుడివాడ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. సభ తర్వాత చంద్రబాబు తిరిగి రోడ్డు మార్గంలో చంద్రబాబు ఉండవల్లి చేరుకోనున్నారు.
తిరువూరులో తెలుగుదేశం 'రా కదలిరా' బహిరంగ సభ - భారీగా తరలివచ్చిన ప్రజలు
Arrangements For Ra Kadali Ra Program in Gudivada : గుడివాడలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న"రా కదలి రా" సభకు దాదాపు లక్ష మంది కార్యకర్తలు హాజరవుతారని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముదినేపల్లి రోడ్డులో మల్లాయిపాలెం వద్ద బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. దాదాపు 20 ఎకరాల విస్తీర్ణంలో సభా వేదిక, పార్టీ ఆహుతులు కూర్చొనేలా ఏర్పాట్లు చేశారు. గ్యాలరీలు, పార్కింగ్ సౌకర్యం కల్పించారు. బందరు, పెడన, పామర్రు, అవనిగడ్డ, పెనమలూరు, గన్నవరం, గుడివాడ నియోజకవర్గాలతోపాటు పరిసర ప్రాంతాలకు చెందిన కైకలూరు, నూజివీడు నియోజకవర్గాల నుంచి భారీగా తరలివచ్చేందుకు టీడీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికే గుడివాడ పట్టణ రహదారులు పసుపుమయంగా మారాయి. భారీ స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పసుపు జెండాలతో అలంకరించారు. కార్యకర్తలకు ఎలాంటి లోటు పాట్లు లేకుండా మజ్జిగ, మంచినీరు వసతి సమకూరుస్తున్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చే వారికి వాహన సౌకర్యం కల్పించారు.
సభను అడ్డుకునేందుకు వైఎస్సార్సీపీ ప్రయత్నాలు : గత సంవత్సరం గుడివైడలో నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమానికి జనం వెల్లువెత్తారు. దీంతో అధికార వైఎస్సార్సీపీ అప్రమత్తం అయ్యింది. ఇప్పుడు ' రా కదలి రా ' కార్యక్రమాన్ని విఫలం చేసేందుకు అధికార పార్టీ ప్రయత్నాలు చేస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఆళ్లగడ్డలో 'రా కదిలి రా' కార్యక్రమానికి సర్వం సిద్ధం
పోలీసుల ఆంక్షలు : గుడివాడ "రా కదలిరా" బహిరంగ సభకు పోలీసుల ఆంక్షలు విధిస్తున్నారు. గుడివాడ పట్టణంలోకి తెలుగుదేశం శ్రేణుల ర్యాలీలు రాకుండా పోలీసుల అడ్డగిస్తున్నారు. తెలుగుదేశం శ్రేణుల వాహనాలను బైపాస్ రహదారుల మీదుగా పోలీసులు దారి మళ్లిస్తున్నారు. గుడివాడ పట్టణం ముఖ్య కూడళ్ల లో భారీగా పోలీసులు మోహరించారు. నెహ్రూ చౌక్ సెంటర్, ఎన్టీఆర్ స్టేడియం పరిసరాల్లో తెలుగుదేశం జెండాలు, బ్యానర్లు కట్టనివ్వకుండా పోలీసు ఆంక్షలు విధించారు. పోలీసులు తీరును తెలుగుదేశం శ్రేణులు తీవ్రంగా తప్పుబడుతున్నారు.
టీడీపీ జెండా ఎగరడం ఖాయం : పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై గుడివాడ టీడీపీ స్థానిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ నేతలు, పోలీసు యంత్రాంగం ఎన్ని అడ్డంకలు, ఆటంకాలు సృష్టించిన "రా కదలి రా" కార్యక్రమాన్ని విజయవంతం చేసి చూపిస్తామని సవాల్ విసిరారు. ఈసారి గుడివాడలో టీడీపీ జెండా ఎగరడం ఖాయమని స్పష్టం చేశారు.
'ఓటమి భయంతోనే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల బదిలీ - టీడీపీ విజయానికిదే నిదర్శనం'