ETV Bharat / bharat

9నెలల వ్యవధిలో మూడుసార్లు కరోనా - A man got corona positive 3 times in 9 months

కరోనా ఒకసారి సోకితేనే భయపడిపోతాం. ఓ వ్యక్తి ఏకంగా మూడోసారి మహమ్మారి బారిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. అది కూడా కేవలం తొమ్మిది నెలల వ్యవధిలోనే మూడుసార్లు కరోనా సోకడం గమనార్హం. ఇది మధ్యప్రదేశ్​లోని గ్వాలియర్​లో జరిగింది.

Corona hospital
కరోనా ఆస్పత్రి, కొవిడ్​ కేర్​ సెంటర్​
author img

By

Published : May 10, 2021, 3:02 PM IST

Updated : May 10, 2021, 3:24 PM IST

మధ్యప్రదేశ్​లోని గ్వాలియర్​ పెరుగుతున్న కరోనా బాధితుల్లో కొత్త కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. ఓ 30ఏళ్ల వ్యక్తి 9 నెలల వ్యవధిలో మూడు సార్లు మహమ్మారి బారిన పడినట్లు వైద్యులు తాజాగ గుర్తించారు.

ఆ వ్యక్తికి.. గతేడాది జులై 26న తొలిసారిగా కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. అయితే.. తీవ్రమైన లక్షణాలేమీ లేనందున ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకుని కోలుకున్నాడు. ఆ తర్వాత.. అక్టోబర్​ 15న మళ్లీ పరీక్షలు నిర్వహించగా.. వైరస్​ ఉన్నట్టు తేలింది. ఇటీవల ఏప్రిల్​ 25న మరోసారి టెస్ట్​లు చేయగా.. కరోనా బారినపడినట్టు నిర్ధరణ అయింది.

సాధారణంగా.. ఓ వ్యక్తి కరోనా నుంచి కోలుకున్నాక శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి. అవి 6 నెలల వరకు వైరస్​ బారినపడకుండా రక్షణ కల్పిస్తాయి. అయితే.. సదరు బాధితుడు మాత్రం.. సుమారు 3 నెలలకోసారి మహమ్మారి బారినపడటం గమనార్హం. వైద్య అధికారులు ఆ రిపోర్టులను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు.

అయితే.. ఈ విషయమై తమకు ఎలాంటి సమాచారం అందలేదని జిల్లా వైద్యాధికారి డాక్టర్​ మనీశ్​ శర్మ అన్నారు. ఆ యువకుడికి మూడు సార్లు ఒకే రకమైన వైరస్​ సోకిందా? దానికి కారణాలేంటి అనే అంశాలపై ఆరా తీస్తున్నట్టు తెలిపారు. ఆ సమాచారాన్ని సేకరించాక.. యువకుడి నమూనాలను తదుపరి పరిశోధనలకు పంపిస్తామని చెప్పారు.

ఇదీ చదవండి: 'టీకా విషయంలో చేతులు దులుపుకున్న కేంద్రం'

Last Updated : May 10, 2021, 3:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.