ETV Bharat / bharat

అకాలీదళ్ యువ నేత దారుణ హత్య - youth akali dal shot

యూత్ అకాలీదళ్ నేతపై గుర్తుతెలియని దుండగులు కాల్పులకు తెగబడ్డారు. కారు ఎక్కుతుండగా వెంబడించి మరీ దాడి చేశారు. ఈ ఘటనలో బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు.

Youth Akali Dal leader Vicky  shot dead in Mohali
యూత్ అకాలీదళ్ నేతపై కాల్పులు
author img

By

Published : Aug 7, 2021, 5:13 PM IST

దాడి దృశ్యాలు

పంజాబ్​లోని మొహలీలో దారుణ హత్య జరిగింది. యూత్ అకాలీదళ్ నేత విక్కీ మిద్దుఖేరపై ఇద్దరు సాయుధులు కాల్పులకు తెగబడ్డారు. పార్కింగ్​ స్థలంలో తన కారు ఎక్కుతుండగా బాధితుడిపై దుండగులు దాడి చేశారు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.

Youth Akali Dal leader Vicky  shot dead in Mohali
కాల్పులు చేస్తున్న దుండగులు

దాడి అనంతరం దుండగులు ఇద్దరూ ఘటనాస్థలం నుంచి పరారయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మొహలీ ఎస్పీ ఆకాశ్​దీప్ సింగ్ ఔలాఖ్ పేర్కొన్నారు. దాడిలో నలుగురి హస్తం ఉందని చెప్పారు. వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

కారు వద్ద దాడి

దుండగులందరూ ముఖాలకు మాస్కులు పెట్టుకున్నారు. బాధితుడిని వెంబడించీ మరీ కాల్చారు. కారులో కూర్చున్నప్పుడు.. ఓసారి కాల్పులు జరపగా విక్కీ తప్పించుకున్నాడు. మొత్తం 8-9 రౌండ్లు కాల్చారని పోలీసులు తెలిపారు. బాధితుడిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు ఆస్పత్రి వర్గాలు ధ్రువీకరించాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.