కరోనా సంక్షోభ సమయంలో మధ్యతరగతి ప్రజలు కూడా రేషన్ షాపుల ముందు క్యూ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని.. మీడియాలో వస్తున్న కథనాలను ఉటంకిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్రంపై విమర్శలు చేశారు. ప్రధాని మోదీ.. అధికార దాహం కారణంగా దేశంలో లక్షల మంది ప్రజలు ఆకలి కోరల్లో చిక్కుకున్నారని ధ్వజమెత్తారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
" మీ అధికార దాహం కారణంగా లక్షల మంది ఆకలితో అలమటించారు. మీరు చేసింది ఏమీ లేదు. కానీ ప్రతిరోజు తప్పుడు వాగ్ధానాలు చేశారు."
-- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
మోదీ..ఓ అబద్ధాల వ్యక్తి(జుమ్లా జీవి) అని హ్యాష్ ట్యాగ్ జతచేశారు రాహుల్.. అంతకుముందు.. తాను 'ది అన్ఫెట్టెడ్ మైండ్' అనే పుస్తకాన్ని చదువుతున్నట్లు ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి: 'దేశంలో క్లిష్ట పరిస్థితులకు కారకులెవరో ప్రజలకు తెలుసు'