Young Women Killed by Family : వేరే వర్గానికి చెందిన వ్యక్తిని ప్రేమించి, అతడితో ఫోన్లో మాట్లాడుతోందని.. ఓ 17 ఏళ్ల యువతిని గొడ్డలితో నరికి చంపారు ఆమె తండ్రి, ఇద్దరు సోదరులు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారు నేరాన్ని అంగీకరించినట్లు వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సరాయ్ అకిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఈ ఘటన జరిగింది. మృతురాలు అదే గ్రామానికి చెందిన వేరే వర్గం యువకుడ్ని ప్రేమించింది. తరుచూ అతడితో ఫోన్ మాట్లాడుతూ, కలుస్తూ ఉండేది. ఈ విషయం ఇంట్లో తెలిసి.. ఆమెను మందలించారు కుటుంబ సభ్యులు. అయినా రహస్యంగా ప్రియుడితో ఫోన్ మాట్లాడేది మృతురాలు.
శనివారం కూడా అలాగే ప్రియుడితో ఫోన్ మాట్లాతుండగా.. ఆమె తండ్రి, ఇద్దరు సోదరులు గమనించారు. అనంతరం ఆగ్రహానికి గురై.. యువతిని గొడ్డలితో నరికి చంపారు. ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఘటనపై కేసు నమోదు చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు.
మొబైల్ కోసం ఇద్దరు సోదరుల హత్య..
Two Brothers Killed for Mobile in Panjab : మొబైల్ కోసం ఇద్దరు సోదరులను కాల్చి చంపారు కొందరు వ్యక్తులు. పంజాబ్‌లోని ఫరీద్‌కోట్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. కిల్లి అరయావాలా ఖుర్ద్ గ్రామానికి చెందిన కుల్దీప్ సింగ్, అతడి సోదురుడ్ని.. ఫిరోజ్‌పుర్‌లోని భావ్‌దే గ్రామానికి చెందిన వ్యక్తులు కాల్చిచంపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భావ్‌దే గ్రామానికి చెందిన వ్యక్తికి.. మృతులకు మధ్య మొబైల్ ఫోన్ గురించి వివాదం నడుస్తోంది. దీంతో మొబైల్ ఫోన్ కోసం భావ్‌దే గ్రామానికి వెళ్లారు కుల్దీప్ సింగ్ సోదరులు. అనంతరం తిరిగి వస్తుండగా మార్గ మధ్యలోనే వీరిని అడ్డుకుని కాల్చి చంపారు నిందితులు.
భార్య వేళ్లు నరికిన భర్త..
Husband Cuts Wife Fingers in Delhi : భార్యకు మత్తు మందు ఇచ్చి.. సృహా కోల్పోయిన తరువాత ఆమె చేతి వేళ్లను నరికేశాడు ఓ భర్త. ఇందు కోసం పథకం ప్రకారం ఓ హోటల్లో రూం బుక్ చేసి.. ఆహారంలో మత్తు పదార్థాలు కలిపి ఈ ఘటనకు పాల్పడ్డాడు. అనంతరం ఘటనాస్థలం నుంచి పారిపోయాడు. శుక్రవారం రాత్రి దిల్లీలోని ఆదర్శ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాగా బాధితురాలి వేళ్లను తిరిగి అతికించేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు.
Fake Pilot for Girlfriends : పైలట్‌నని నమ్మించి మోసం.. నలుగురు అమ్మాయిలతో ప్రేమాయణం.. ఆఖరికి..