murder in mancherial district: మంచిర్యాలజిల్లా ఇందారంలో పట్టపగలే ఓ యువకుడు దారుణ హత్య గురయ్యాడు. మహేశ్ అనే వ్యక్తి కొన్నాళ్లుగా ఓ వివాహితను వేధిస్తున్నాడనే ఆరోపణలతో ఆ యువతి కుటుంబ సభ్యులు అతడిని దారుణంగా హతమార్చారు. అందరూ చూస్తుండగానే కత్తులతో దాడి చేస్తూ.. రాళ్లతో తల పగులగొట్టారు. ఇదంతా అక్కడున్న చోద్యం చూశారే కానీ ఎవరూ ఆపే ప్రయత్నం చేయలేదు. ఎందుకని అడిగితే అతడు చేసిన ఓ దుర్మార్గమైన పని చూసి అతడిని కాపాడాలని తమకు అనిపించలేదని స్థానికులు చెబుతున్నారు. ఇంతకీ ఆ యువకుడు ఏం చేశాడు..? ఆ కుటుంబం అతడిని ఎందుకు కొట్టి చంపింది..?
పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా ఇందారంలో పట్టపగలే ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మహేశ్ అనే యువకుడిని నలుగురు వ్యక్తులు కత్తితో పొడిచి, తలపై బండరాయితో కొట్టి హత్య చేశారు. వేధింపుల వ్యవహారమే హత్యకు కారణంగా తెలుస్తుంది. ఏడాది క్రితం వరకు మహేశ్ ఓ యువతి ఇద్దరు ప్రేమించుకున్నారు. ఆర్నెళ్ల క్రితం యువతికి మరో యువకుడితో వివాహం జరిగింది.
అప్పటిదాక తనే జీవితమని బతుకున్న మహేశ్.. ఆ అమ్మాయి వేరే అతడిని పెళ్లి చేసుకోవడంతో తట్టుకోలేక పోయాడు. ఆ బాధను జీర్ణించుకోలేక క్షణికావేశంలో ఓ తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. ఆ అమ్మాయితో సన్నిహితంగా ఉన్న వీడియోలను సామాజిక మాధ్యమాలలో బహిర్గతం చేశాడు. ఈ వీడియోలను చూసిన యువతి భర్ ఆమెకు విడాకులిచ్చాడు. అంతటితో ఆగకుండా అవమాన భారంతో.. ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త ఆత్మహత్య తర్వాత పుట్టింటికి వచ్చిన యువతిని.. మళ్లీ కొన్నాళ్లుగా మహేశ్ వేధిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి.
ఈ అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టికోవట్లేదని కోపంతో బాధిత యువతి కుటుంబీకులు కక్ష పెంచుకున్నారు. అతడి వల్ల తమ కుటుంబం పరువు పోతుందని అవమానకరంగా భావించారు. ఎలాగైనా అతడి అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేశారు. అందులో భాగంగానే ఇవాళ ఉదయం పాలు పోసి వస్తుండగా మహేశ్‌ను అడ్డగించారు. అనంతరం అతడిని కత్తితో పొడిచి, బండరాయితో మోదీ హత్య చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
మరోవైపు ఈ క్రమంలోనే మహేశ్ మృతదేహనికి మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు గ్రామాన్ని తీసుకొచ్చారు. తాము పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న విధంగా అధికార పార్టీకి చెందిన ఇద్దరు నేతలు, ఎస్ఐ రామకృష్ణపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ మృతుడి బంధువులు రోడ్డుపై ధర్నా చేపట్టారు. వారిపై చర్యలు తీసుకునేంతవరకు కదిలేదిలేదని స్పష్టం చేశారు. ఈ ఘటనకు కారణమైన వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హమీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.
"ఉదయాన్నే పాలు పోసిన అనంతరం.. పెట్రోలు కొట్టించుకుని బైక్‌పై వస్తుండగా యువతి కుటుంబ సభ్యులు అతడిని అడ్డగించారు. కత్తులు, రాళ్లతో దాడి చేసి దారుణంగా కొట్టి చంపారు.అనంతరం పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయారు." - నరేందర్, ఏసీపీ
ఇవీ చదవండి: