Young Man Murdered In Bihar : ఓ యువకుడి గొంతు కోసి, తుపాకీతో కాల్చి దారుణంగా హత్య చేశారు దుండగులు. ఈ ఘటన బిహార్ మెహసీ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి జరిగింది. నిందితులు మృతుడి కళ్లను సైతం పీకినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అతడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం
తూర్పు చంపారణ్ జిల్లా పరిధిలోని ఓజిల్పుర్ గ్రామానికి చెందిన నాగేంద్ర గురువారం రాత్రి తన పశువుల కొట్టంలో నిద్రపోయేందుకు వెళ్లాడు. తెల్లవారి చాలా సమయమైనా ఇంటికి తిరిగి రాలేదు నాగేంద్ర. దీంతో కంగారుపడ్డ కుటుంబ సభ్యులు పశువుల కొట్టానికి వెళ్లి చూసేసరికి అక్కడ రక్తపు మడుగులో అతడి మృతదేహం కనిపించింది. అనుమానస్పద స్థితిలో నాగేంద్ర మరణించడం వల్ల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టామని మెహసీ పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురిపై కేసు నమోదు చేశామని వెల్లడించారు.
ఆరేళ్ల చిన్నారిని కాల్చిచంపిన దుండగులు
కొన్నాళ్ల క్రితం పంజాబ్‌లో దుండగులు జరిపిన కాల్పుల్లో ఆరేళ్ల చిన్నారి మృతి చెందాడు. బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు తండ్రి ఎదుటే కొడుకును కాల్చి చంపారు. బాలుడి తండ్రిని చంపేందుకు వచ్చిన దుండుగులు గురితప్పి చిన్నారిని కాల్చినట్లుగా తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతి చెందిన బాలుడిని ఉదయ్వీర్గా పోలీసులు గుర్తించారు. మన్సా జిల్లాలో ఈ దారుణ ఘటన జరిగింది. మొత్తం వార్తను చదివడానికి ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
విద్యార్థినిని కాల్చిచంపిన యువకులు
కొన్నాళ్ల క్రితం ఉత్తర్‌ప్రదేశ్‌లోని జలౌన్ జిల్లాలో దారుణం జరిగింది. పరీక్ష ముగించుకుని రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న ఓ విద్యార్థినిని బైక్‌పై వచ్చి అత్యంత కిరాతకంగా కాల్చిచంపారు ఇద్దరు యువకులు. పట్టపగలే పోలీస్ స్టేషన్‌కు 200 మీటర్ల దూరంలోనే ఈ ఘటన జరగడం వల్ల ఆ ప్రాంతంలో కలకలం రేగింది. బాలికపై కాల్పులు జరిపిన పిస్టల్‌ను దుండగులు ఘటన స్థలంలోనే వదిలి వెళ్లారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. పూర్తి వార్తను చదివేందుకు ఈ లింక్ పై చేయండి.
సరిగ్గా చూసుకోవడం లేదని తల్లిని కాల్చి చంపిన మైనర్.. రెండు నెలల పాపను చంపిన అమ్మ
12 Year Old Girl Dead : 'బంతిపూల మొక్కలు దొంగలించిందని బాలిక హత్య.. చెట్టుకు వేలాడదీసి..'