ETV Bharat / bharat

Live Video: రూ.2500 కోసం ఫ్రెండ్​ను కత్తితో పొడిచి.. - Chandigarh friend murdered news

రూ. 2500 కోసం తోటి స్నేహితుడిని కిరాతకంగా పొడిచి చంపాడు ఓ యువకుడు. ఈ ఘటన పంజాబ్​లో జరిగింది.

friend murder
మర్డర్​
author img

By

Published : Nov 15, 2021, 4:31 PM IST

Updated : Nov 15, 2021, 4:45 PM IST

మర్డర్​

పంజాబ్, చండీగఢ్​లోని సెక్టార్-32 ప్రాతంలో దారుణం జరిగింది. రూ. 2500 కారణంగా ఇద్దరు స్నేహితుల మధ్య ఘర్షణ ఏర్పడింది. ఈ క్రమంలో మిత్రుడ్ని కిరాతకంగా కత్తితో పొడిచి చంపాడు మరో యువకుడు.

ఇదీ జరిగింది..

చండీగఢ్​ సెక్టార్-32 ప్రాతంలో ఉండే నిఖిల్(18), అభి(20) స్నేహితులు. కొద్దిరోజుల క్రితం నిఖిల్​.. తన మోటార్​బైక్​ను అభికు అమ్మాడు. ఈ క్రమంలో అభి, నిఖిల్​కు కొంత డబ్బు ఇచ్చాడు. ఇంకా రూ. 2500 ఇవ్వాల్సి ఉంది. దీంతో నిఖిల్​.. బైక్ పత్రాలను తనవద్దే పెట్టుకున్నాడు. మిగతా డబ్బుకోసం అభిని నిలదీశాడు.

ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఘర్షణ తలెత్తింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. కోపంతో అభి.. నిఖిల్​ను కత్తితో పొడిచాడు. నిఖిల్​ను ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు. అభి ప్రస్తుతం పరారీలో ఉన్నాడని.. గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

ఇదీ చూడండి: Rape Victim: 6 నెలలుగా బాలికపై 400 మంది అత్యాచారం!

Last Updated : Nov 15, 2021, 4:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.