ETV Bharat / bharat

మైనర్​పై అత్యాచారం.. యువకుడికి 50 ఏళ్ల కఠిన కారాగార శిక్ష - కేరళ వార్తలు

మైనర్​పై అత్యాచారానికి పాల్పడిన ఓ యువకుడికి కేరళలోని స్పెషల్​ పోక్సో కోర్టు 50 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. 2018లో జరిగిన ఘటనకు సంబంధించిన కేసును విచారించిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పునిచ్చింది.

Etv Youth gets 50 years imprisonment for raping a minor girl in kerala
Youth gets 50 years imprisonment for raping a minor girl in kerala
author img

By

Published : Sep 28, 2022, 9:37 PM IST

కేరళలోని కున్నంకుళం ఫాస్ట్రాక్​ స్పెషల్​ పోక్సో కోర్టు ఓ అత్యాచార నిందితుడికి 50 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.60,000 జరిమానా విధించింది.
పోలీసుల వివరాల ప్రకారం.. 2018లో కున్నంకుళంలోని పోర్కులానికి చెందిన సయూజ్​ అనే యువకుడు అదే ప్రాంతంలో ఉంటున్న ఓ బాలిక ఇంట్లోకి వెళ్లి బలవంతంగా ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చంపేస్తానని బెదిరించాడు. దీంతో మానసికంగా కుంగిపోయిన బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేసింది. ఆ తర్వాత ఆమెను తల్లిదండ్రులు ఆరా తీయగా విషయం బయటపెట్టింది.

సయూజ్​
సయూజ్​

వెంటనే బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక వాంగ్మూలాన్ని నమోదు చేసిన పోలీసులు సయూజ్‌ను అరెస్టు చేశారు. తాజాగా ఈ కేసును విచారించిన ఫాస్ట్రాక్ స్పెషల్ పోక్సో కోర్టు అతడికి 50 ఏళ్ల జైలుశిక్ష, రూ.60,000 జరిమానా విధించింది.

ఇవీ చదవండి:గుండెపోటుతో యువ రెజ్లర్​ మృతి.. వాకింగ్​ చేసి వస్తుండగా అక్కడికక్కడే..

'ఇంటింటికీ రేషన్​ పథకం చట్టవిరుద్ధం'.. హైకోర్టు తీర్పు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.