ETV Bharat / bharat

14 ఏళ్లకే 13 పుస్తకాలకు రచయిత.. 200 సినిమాలకు రివ్యూలు!

author img

By

Published : Mar 20, 2022, 7:30 AM IST

Young Author in Kerala: కథలు, నవలలు రచించాలంటే అపారమైన ప్రతిభ కావాలి. ప్రొఫెషనల్​ రైటర్స్​ కూడా పలు సందర్భాల్లో ఇబ్బంది పడుతుంటారు. అటువంటిది ఓ 14 ఏళ్ల బాలిక అలవోకగా కథలు, నవలలు, సినిమా రివ్యూలు రాస్తోంది. తొమ్మిదో తరగతికే 13 పుస్తకాలు రాసేసింది.

Young Author in Kerala
సనీషా

Young Author in Kerala: సాధారణంగా ఆటలంటే తెగ ఇష్టపడే పిల్లలు.. పుస్తకాలు చదవమనే సరికి మొహం చాటేస్తారు. అలాంటిది ఓ అమ్మాయి చిన్న వయసులోనే రచయితగా మారింది. పుస్తకాలు, పద్యాలు, సినిమా రివ్యూలు రాస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఎన్నో అవార్డులు కూడా అందుకుంది.

Young Author in Kerala
సనీషా

కేరళలోని కాసరగోడ్​కు చెందిన 14 ఏళ్ల సనీషా.. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. ఆటపాటలు, చదువుతో ఆడుతూపాడుతూ గడిపే ఆ వయసుకే సనీషా.. ఇంగ్లీష్​, మలయాళంలో పుస్తకాలు రాస్తూ మంచి రచయితగా గుర్తింపు తెచ్చుకుంది. 6వ తరగతిలో ఉండగా రచనలపై పుట్టిన ఇష్టం ఆమెను ఇప్పటివరకు 13 పుస్తకాలు రాసేలా చేసింది. తొలిసారిగా ఆరో క్లాస్​లో ఇంగ్లీష్​లో పుస్తకాన్ని రాసిన సనీషా.. ఆ తర్వాత వివిధ నవలలు, షార్ట్​ స్టోరీస్​, పద్యాలు రాసింది. అంతేకాదు రెండు వందల క్లాసికల్​ చిత్రాలకు రివ్యూలు కూడా రాసింది. సనీషానే స్వయంగా తను రచించిన పుస్తకాలకు కవర్​ పేజీలను తయారు చేసుకోవడం విశేషం.

Young Author in Kerala
స్నేహితులతో సనీషా

ఈ ప్రతిభే ఆమెను అవార్డులు వరించేలా చేసింది. సనీషా ప్రతిభను గుర్తించిన కేరళ ప్రభుత్వం.. 'ఉజ్వల బాల్యం' పురస్కారాన్ని అందజేసింది. వీటితో పాటు ఎన్​ఎన్​ కాక్కడ్​ అవార్డు సహా గతేడాది ప్రముఖ రాయల్​ కామన్​వెల్త్​ సొసైటీ అవార్డును కూడా అందుకుంది.

చిన్న వయసులోనే తన రచనలతో అద్భుతమైన ప్రతిభను కనబరుస్తున్న సనీషా.. భవిష్యత్తులో సినీ దర్శకురాలిని అవుతానని అంటోంది.

ఇదీ చూడండి : 'వైద్యుడితోనైనా బాక్సింగ్‌ చేసేంత బలంగా ఉన్నా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.