ETV Bharat / bharat

యోగి ప్రమాణస్వీకారానికి డేట్ ఫిక్స్.. అతిథిగా మోదీ! - up cabinet

UP CM Yogi Adityanadh oath: ఉత్తర్​ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈనెల 25వ తేదీన యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరుకానున్నట్లు భాజపా వర్గాలు వెల్లడించాయి. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలుస్తోంది. ఈ కార్యక్రమం కోసం లఖ్‌నవూలోని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ ఇకానా మైదానంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

yogi adityanadh oath ceremony
ఉత్తర్​ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం
author img

By

Published : Mar 20, 2022, 9:45 AM IST

UP CM Yogi Adityanadh oath: ఉత్తర్‌ప్రదేశ్‌లో మరోసారి భాజపా ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈనెల 25వ తేదీన ముఖ్యమంత్రితోపాటు మంత్రుల ప్రమాణస్వీకారానికి భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. సాయంత్రం 4 గంటలకు యోగి ప్రమాణస్వీకారం ఉండనుంది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరు కానున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే లఖ్‌నవూలోని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ ఇకానా మైదానంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. 75వేల సీటింగ్‌ కెపాసిటీని సిద్ధం చేస్తున్నారు. అడిషనల్‌ చీఫ్‌ సెక్రెటరీ నవీన్‌ సెహ్‌గల్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. చీఫ్‌ సెక్రెటరీ డీఎస్‌ మిశ్రా ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తికావచ్చినట్లు తెలిపారు. 'ప్రమాణ స్వీకారోత్సవంలో 75 వేల మంది కూర్చునే ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రాండ్‌గా జరగబోయే ఈ కార్యక్రమం కోసం సన్నాహాలు జరుగుతున్నాయి' అని సెహ్‌గల్‌ పేర్కొన్నారు.

యూపీ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్‌ ప్రమాణం చేయబోయే ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా రాబోతున్నారని భాజపా వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. ఆయనతోపాటు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా మరికొందరు కేంద్ర మంత్రులు హాజరుకానున్నట్లు సమాచారం. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు.

కొత్త మంత్రివర్గంలో 20 మందికి పైగా కేబినెట్‌ హోదా మంత్రులు ఉంటారని, దాదాపుగా అదే సంఖ్యలో స్వతంత్ర, సహాయ హోదా అమాత్యులు ఉంటారని తెలుస్తోంది. ఇటీవల జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా భారీ విజయంతో వరుసగా రెండోసారి అధికార పీఠం దక్కించుకుంది భాజపా. మొత్తం 403 స్థానాలకు.. భాజపా 255 సీట్లు సాధించింది. దాని మిత్రపక్షాలు 18 స్థానాల్లో గెలుపొందాయి.

ఇదీ చదవండి: విద్యను కాషాయీకరిస్తే తప్పేముంది?: వెంకయ్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.