ETV Bharat / bharat

'ఎన్నికల తర్వాత సీఎం మార్పు తథ్యం!' - పాటిల్​ యత్నల్ సీఎం పై కామెంట్లు

కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పపై ఆ పార్టీ ఎమ్మెల్యే పాటిల్​ యత్నాల్​ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐదు అసెంబ్లీలకు ఎన్నికలు పూర్తికాగానే సీఎంను మారుస్తారని అన్నారు.

Yeddyurappa leadership will change after five-state election: Yathnal
'ఈ ఎన్నికల తరువాత సీఎం మార్పు తథ్యం'
author img

By

Published : Mar 21, 2021, 10:34 AM IST

కర్ణాటక సీఎం యడియూరప్పపై ఆ పార్టీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐదు అసెంబ్లీల ఎన్నికలు పూర్తవగానే ముఖ్యమంత్రిగా ఆయన్ను తొలగిస్తారని ఎమ్మెల్యే పాటిల్​ యత్నాల్ జోస్యం చెప్పారు.

అధిష్ఠానానికి యుడియూరప్పపై నమ్మకం పోయిందన్నారు పాటిల్. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ప్రజల ముందుకు పార్టీ వెళ్లలేని పరిస్థితి నెలకొన్నట్లు తెలిపారు. ఈ కారణం చేతనే సీఎం మార్పు తథ్యం అని అన్నారు.

"ఇప్పటికే పార్టీ అధినాయకత్వం ఉత్తరాఖండ్​లో ముఖ్యమంత్రిని మార్చింది. ఇప్పుడు హరియాణా, కర్ణాటక వంతు. ఎన్నికల ప్రక్రియ పూర్తికాగానే నాయకత్వం మార్పు ఉంటుంది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల గురించి పార్టీ పెద్దలకు తెలుసు."

- పాటిల్​ యత్నాల్, భాజపా ఎమ్మెల్యే

ఇటీవల సీఎం యడియూరప్పకు సంబంధించిన ఓ సీడీపైనా పాటిల్​ సంచలన విషయాలు వెల్లడించారు. ఆపరేషన్​ కమల్​లో పాల్గొన్న 17మంది ఎమ్మెల్యేల దగ్గర ఆ సీడీ ఉందని, దాన్ని వారు ఎప్పుడు, ఎలా వాడుకుంటారో తెలియదని విమర్శించారు.

ఇదీ చూడండి: 'కర్ణాటక సీఎంకు సంబంధించిన సీడీ ఉంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.