Indian Army Dog Zoom Passes Away : జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో తీవ్రంగా గాయపడిన ఆర్మీ శునకం 'జూమ్' మృతి చెందింది. శ్రీనగర్‌లోని వెటర్నటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జూమ్.. గురువారం మధ్యాహ్నం మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇళ్లలో నక్కి ఉన్న ఉగ్రవాదులను గుర్తించేందుకు ప్రత్యేకంగా శిక్షణనిచ్చిన జూమ్ అనే శునకాన్ని ఉపయోగిస్తున్నారు.
ఇదీ జరిగింది..
అనంతనాగ్‌లోని తంగపావా ప్రాంతంలో ఇద్దరు లష్కరే తొయిబా ఉగ్రవాదులు ఉన్నట్లు భద్రతా అధికారులకు సోమవారం సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ముష్కరులపై భద్రతా బలగాలు దాడులు చేశాయి. ఇంట్లో ఉన్న ఉగ్రవాదులను గుర్తించేందుకు 'జూమ్' అనే ఆర్మీ శునకాన్ని పంపించారు అధికారులు. ఈ క్రమంలో జూమ్‌పై కాల్పులకు పాల్పడ్డారు ఉగ్రవాదులు. దీంతో శునకానికి బులెట్ గాయాలయ్యాయి. అయినా జూమ్ వీరోచిత పోరాటాన్ని కొనసాగించింది. దాని ఫలితంగానే భద్రతాబలగాలు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. అనంతరం తీవ్రంగా గాయపడిన జూమ్‌ను ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించారు.
"ఆర్మీ శునకం జూమ్.. శ్రీనగర్‌లోని వెటర్నటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం 12 గంటలకు మరణించింది. అనంతనాగ్‌లో ఉగ్రవాదులు శునకంపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలయ్యాయి. జూమ్ వయసు 25 నెలలు.. బెల్జియన్ షెపర్డ్ జాతికి చెందినది. గత ఎనిమిది నెలలుగా భారత ఆర్మీకి సేవలు అందిస్తోంది. గురువారం వరకు బాగానే ఉన్నట్లు కనిపించిన శునకం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది."
--అధికారులు
ఇవీ చదవండి: అటెండర్‌గా పనిచేసిన కాలేజీకి అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా.. డ్యూటీ చేస్తూనే చదువుతూ..