world's tallest pier bridge: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన స్తంభపు వంతెనను రైల్వే శాఖ నిర్మిస్తోంది. మణిపుర్లో జిరిబామ్-ఇంఫాల్ రైల్వే ప్రాజెక్టులో భాగంగా ఈ వంతెన నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా.. 141 మీటర్ల ఎత్తైన స్తంభం నిర్మిస్తుండగా.. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ పిల్లర్‌గా నిలవనుందని రైల్వేశాఖ తెలిపింది.
111 కిలోమీటర్ల పొడవుతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పూర్తయితే జిరిబామ్-ఇంఫాల్ మధ్య ప్రయాణ సమయం గతం కన్నా 2-2:30గంటలు తగ్గనుందని ప్రాజెక్ట్ చీఫ్ ఇంజినీర్ సందీప్ శర్మ తెలిపారు. ప్రస్తుతం జిరిబామ్-ఇంఫాల్ మధ్య దూరం 220 కిలోమీటర్లు ఉందని. సాధారణంగా ప్రయాణానికి 10-12 గంటల సమయం పట్టేదన్నారు.
మొదటి దశలో 12 కిలోమీటర్లు బ్రిడ్జ్ నిర్మాణం ఇప్పటికే పూర్తయిందని, రెండో దశ పనులు 2022, ఫిబ్రవరి నాటికి పూర్తవుతాయన్నారు. 2008లో 13,800 కోట్లతో మంజూరైన ఈ ప్రాజెక్టు.. 2023, డిసెంబర్ నాటికి రైల్వే వంతెన పూర్తిగా ప్రయాణానికి అందుబాటులోకి వస్తుందన్నారు.
హిమాలయ కొండల్లో రైల్వేశాఖ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో 47 సొరంగాలు, 156 వంతెనలు ఉండగా.. కరోనా కారణంగా పనులు కొంత ఆలస్యమైనట్లు తెలిపారు.
ఇదీ చూడండి: 'ఒమిక్రాన్'పై ముందస్తు జాగ్రత్తలు- రాష్ట్రాలు సన్నద్ధం