ఇంటి నుంచి పనిలో(వర్క్ ఫ్రం హోం) ఉన్న పలువురు షేర్ చేసిన సరదా సన్నివేశాలు, ఫన్నీ మూమెంట్స్ గతేడాది నుంచి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ తరహాలోనే.. తన వివాహం రోజు మండపంలో వరుడు ల్యాప్‌టాప్ పట్టుకుని కూర్చున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఇన్‌స్టాలో వైరల్..
వరుడు ల్యాప్‌టాప్‌లో పనిచేస్తుండగా అతిథులతో పాటు.. పండితులు అతని కోసం ఎదురుచూస్తుండటం గమనించవచ్చు. మహారాష్ట్రలో జరిగిన ఈ వివాహం తాలూకు దృశ్యాలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. వివాహాలకు సంబంధించిన వీడియోలను షేర్ చేసే ఓ ప్రముఖ సంస్థ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
మండపంలో మరోవైపు కూర్చుని ఉన్న వధువు వైపు కెమెరా తిప్పగానే ఆమె సరదాగా నవ్వడం కొసమెరుపు. ఇక ఆలస్యం అవుతుందని అనుకున్నాడో.. లేక అందరూ తననే గమనిస్తున్నారు అనుకున్నాడో ఏమో.. ల్యాప్‌టాప్‌ని ఇతరులకు అప్పగించాడు వరుడు.
అయితే.. ఈ వీడియోను చూసిన నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
- పెళ్లి రోజున ఏమి చేయాలో తెలియక పనిని ముందేసుకున్నారా? అని ఒకరు చమత్కరించారు.
- ఉద్యోగులను ఇబ్బందిపెట్టేలా ఉన్న కార్యాలయ సమయాలను కొందరు నిందించారు.
- వర్చువల్ వివాహానికి(ప్రత్యక్ష ప్రసారం) అవసరమైన ఏర్పాట్లు చేశాడా? అని ఓ యూజర్ సందేహాన్ని లేవనెత్తారు.
ఇవీ చదవండి: