Women Give Birth To Two Childs In Travelling: కర్ణాటకలో ఓ మహిళ ప్రసవం ఆసక్తికరంగా మారింది. ఆమె తన ఇద్దరు చిన్నారులకు ప్రయాణంలోనే జన్మనిచ్చింది. రెండేళ్ల క్రితం మొదటి బిడ్డకు ఆటోలో జన్మనివ్వగా.. తాజాగా రెండో బిడ్డను అంబులెన్స్‌లో ప్రసవించింది.

చామరాజనగర్ జిల్లాలోని కౌడల్లి గ్రామంలో శేషన్న, జ్యోతికి కొన్నేళ్ల క్రితమే వివాహం అయింది. జ్యోతి మొదటి కాన్పులో ఆస్పత్రికి తీసుకువెళ్లే క్రమంలో ఆటోలోనే ప్రసవించింది. తాజాగా రెండోసారి పురిటినొప్పులు రాగా.. స్థానిక ఆస్పత్రికి తీసుకువెళ్లారు కుటుంబ సభ్యులు. రక్తం అవసరమవుతుందని గ్రహించిన డాక్టర్లు.. పెద్ద ఆస్పత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. అంబులెన్స్‌లో వేరే ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా.. ప్రయాణంలోనే రెండో బిడ్డకు కూడా జన్మనిచ్చింది.
ఇదీ చదవండి: పంచాయతీ ఆఫీస్‌లో మోదీ ఫొటో కోసం గొడవ- ఒకరు అరెస్ట్