ETV Bharat / bharat

జైలు నుంచి మహిళ పరార్.. లిఫ్ట్ ఇస్తానని విద్యార్థి రేప్.. ఆపై మరో వ్యక్తి...

author img

By

Published : May 23, 2022, 5:39 AM IST

WOMAN RAPED TWICE: పునరావాస కేంద్రం నుంచి పరార్ అయిన ఓ మహిళకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. కేంద్రం నుంచి బయటకు వచ్చి ఓ వ్యక్తిని లిఫ్ట్ కోరగా.. అతడు తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేసి ఎవరు లేని ప్రదేశంలో వదిలి పెట్టాడు. ఒంటరిగా ఉన్న ఆ బాధితురాలిని గమనించిన ఓ క్యాబ్ డ్రైవర్.. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

WOMAN RAPE TWICE
WOMAN RAPE TWICE

WOMAN RAPED TWICE: లిఫ్ట్ ఇస్తామని చెప్పి మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్​లో శుక్రవారం ఈ ఘటన జరిగింది. నిందితులను కుల్దీప్ బిష్ణోయ్(23), బాబురామ్ జాట్(22)గా గుర్తించారు పోలీసులు. కుల్దీప్.. విద్యార్థి కాగా, బాబురామ్ క్యాబ్ డ్రైవర్​గా పనిచేస్తున్నాడు.

బాధిత మహిళకు 18ఏళ్లు ఉంటాయని.. 14ఏళ్ల వయసులోనే ఆమెకు వివాహమైందని పోలీసులు వెల్లడించారు. తన వదినను చంపినందుకు ఆమెను అదుపులోకి తీసుకొని మందోర్​లోని పునరావాస కేంద్రంలో ఉంచినట్లు తెలిపారు. తన బిడ్డను చూసేందుకు అక్కడి నుంచి శుక్రవారం రాత్రి తప్పించుకున్న ఆ మహిళ.. అత్యాచారానికి గురైందని వెల్లడించారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆ మహిళ పునరావాస కేంద్రం నుంచి పారిపోగానే.. రహదారిపై బిష్ణోయ్ కనిపించాడు. బస్టాండ్ వరకు లిఫ్ట్ ఇస్తానని చెప్పి బైక్ ఎక్కించుకున్నాడు. కానీ, అక్కడికి తీసుకెళ్లకుండా.. తన రూమ్​కు వెళ్లాడు. అక్కడ మహిళపై అత్యాచారం చేశాడు. అనంతరం, ఆమెను సమీపంలోని ఓ బ్రిడ్జి వద్ద వదిలేసి వెళ్లిపోయాడు. బిష్ణోయ్ మందోర్ స్టేషన్​లో పనిచేసే ఓ పోలీసు కుటుంబానికి చెందినవాడని స్టేషన్ హౌజ్ అధికారి మనీశ్ దేవ్ వెల్లడించారు.

కాగా, అర్ధరాత్రి సమయంలో ఆ బ్రిడ్జి వద్ద ఉన్న మహిళను గమనించి అటుగా వెళ్తున్న క్యాబ్ డ్రైవర్ బాబురామ్ ఆగాడు. బస్టాండ్​కు వెళ్లేందుకు నిరీక్షిస్తున్నానని ఆమె చెప్పగా.. అతడు కారు ఎక్కించుకున్నాడు. అతడు కూడా ఆమెపై కామవాంఛ తీర్చుకున్నాడు. సమీపంలోని కైలానా సరస్సు వద్దకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం, ఆమెను శనివారం ఉదయం 5.30 గంటల సమయంలో బస్టాండ్ వద్ద విడిచిపెట్టాడు.

ఎలాగోలా ఇంటికి చేరుకున్న ఆ మహిళ.. కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. కుటుంబ సభ్యులతో కలిసి మందోర్ పోలీస్ స్టేషన్​కు వెళ్లి బాధితురాలు ఫిర్యాదు చేసింది. పునరావాస కేంద్రం నుంచి ఆ మహిళ తప్పించుకోవడం ఇది రెండోసారి అని పోలీసులు తెలిపారు. గతేడాది అక్టోబర్​లోనూ తన బిడ్డను చూసేందుకు తప్పించుకుందని చెప్పారు. బాధితురాలిపై జరిగిన అత్యాచార కేసుపై విచారణ జరుపుతున్నామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.