ETV Bharat / bharat

చదువులో ముందున్నాడని కూల్​ డ్రింక్​లో విషం.. బాలుడు మృతి - puducherry boy with poisoned cool drink

పుదుచ్చేరిలోని కారైకాల్ మున్సిపాలిటీలో దారుణం జరిగింది. తన పిల్లల కంటే మంచిగా చదువుతున్నాడని ఓ 8వ తరగతి బాలుడికి విషం కలిపిన కూల్​ డ్రింక్​ ఇచ్చారు. పరిస్థితి విషమించడం వల్ల మృతి చెందాడు.

eighth standard student dies
Woman poisons daughter's classmate to death as she did not want him to outperform her ward
author img

By

Published : Sep 4, 2022, 8:56 PM IST

తన పిల్లల కంటే చదువులో ముందున్నాడని కూల్​ డ్రింక్​లో విషం కలిపిందో మహిళ. అది తాగిన బాలుడు వాంతులు చేసుకుని ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన పుదుచ్చేరిలోని కారైకాల్​ మున్సిపాలిటీలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ప్రైవేట్​ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాల మణికందన్​ స్కూల్​ వార్షిక దినోత్సవం సందర్భంగా ప్రాక్టీస్​ చేయడానికి వెళ్లాడు. అయితే ఇంటికి తిరిగి వచ్చిన అనంతరం వాంతులు చేసుకోవడం మొదలు పెట్టాడు. తల్లిదండ్రులు వెంటనే మణికందన్​ను ఆస్పత్రికి తరలించారు. చికిత్స చేస్తుండగానే అతడు మృతిచెందాడు.

అయితే స్కూల్​ వాచ్​మెన్​ కూల్​ డ్రింక్​ ఇచ్చినప్పటి నుంచి వాంతులు చేసుకుంటున్నాడని మణింకందన్​ తండ్రి ఆరోపించారు. తల్లిదండ్రులు ఇచ్చిన కూల్​ డ్రింక్స్​నే పిల్లలకు ఇచ్చామని పాఠశాల యాజమాన్యం చెబుతోంది. తాము ఇవ్వలేదని బాలుడి తల్లిదండ్రులు అంటున్నారు. అయితే ఈ విషయంపై వాచ్​మెన్​ దేవదాస్​ను నిలదీయగా, బాలుడికి సంబంధించిన వారే ఆ డ్రింక్​ ఇచ్చారని చెప్పాడు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా సకయా రాణి విక్టోరియా అనే మహిళ ఇచ్చిందని స్పష్టమైంది. విక్టోరియా పిల్లలు కూడా అదే పాఠశాలలో చదవుతున్నారు. దీనిపై బాలుడి తల్లి మాలతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితురాలిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరింది.
మణికందన్​కు విషం కలిపిన కూల్​ డ్రింక్​ ఇచ్చిన విద్యార్థి తల్లిదండ్రులను అరెస్టు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఇవీ చదవండి: ఫోన్​లో గేమ్​ ఆడుతూ చనిపోయిన బాలుడు.. అసలేమైందంటే?

పాత బైక్​లపై ఎమ్మెల్యే ఆసక్తి.. 70 ఏళ్ల క్రితం నాటి వాహనాలు భద్రంగా..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.