ETV Bharat / bharat

ఒకే కాన్పులో ముగ్గురు ఆడపిల్లలు- కొడుకు కోసం చూస్తే మొత్తం ఐదుగురు అమ్మాయిలు - ముగ్గురు ఆడపిల్లలకు మహిళ జన్మ

Woman Gives Birth To Triplets : కుమారుడు కావాలన్న కోరికతో గర్భం దాల్చిన ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. ఆమెకు అప్పటికే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బిహార్​లో జరిగిందీ సంఘటన.

Woman Gives Birth To Triplets
Woman Gives Birth To Triplets
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 11, 2023, 4:44 PM IST

Updated : Dec 11, 2023, 6:24 PM IST

Woman Gives Birth To Triplets : బిహార్​లోని జముయీ జిల్లాకు చెందిన ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు పండంటి ఆడబిడ్డలకు జన్మనిచ్చింది. అయితే ఆ మహిళకు ఇప్పటికే ఇద్దరు కుమార్తెలు ఉన్నారని కుటుంబసభ్యులు తెలిపారు. కుమారుడి కోసం గర్భం దాల్చగా ముగ్గురు ఆడపిల్లలను జన్మనిచ్చిందని చెప్పారు.

జిల్లాలోని ఖైర్ బ్లాక్​ మంగోబందర్​ గ్రామానికి దిల్​చంద్ మాంఝీతో బిందు దేవి అనే మహిళకు పదేళ్ల క్రితం వివాహం జరిగింది. కూలీ పనులు చేసుకుంటూ వీరు జీవనాన్ని సాగిస్తున్నారు. గుడిసెలో నివాసముంటున్నారు. వీరికి ఇప్పటికే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు కావాలన్న కోరికతో ఆమె కొన్ని నెలల క్రితం గర్భం దాల్చింది. కానీ ఈసారి ఏకంగా ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చింది.

"10 సంవత్సరాల క్రితం బిందుదేవికి దిల్‌చంద్ మాంఝీతో పెళ్లి జరిగింది. కుటుంబపోషణ కోసం వీరు కూలీ పనులు చేస్తున్నారు. వీరికి ఇప్పటికే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిద్దరి వయసు మూడేళ్ల లోపే. ఈసారి బిందు ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలు ఆరోగ్యంగానే ఉన్నారు. కానీ నా కుమార్తె కుటుంబ పోషణ ఎలా సాగుతుందో అర్థం కావడం లేదు" అని మహిళ తల్లి ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు, తమకు ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన లేదని మహిళ చెప్పింది. ప్రభుత్వం నుంచి రేషన్ అందడం లేదని తెలిపింది.

Woman Gives Birth To Triplets
మహిళకు జన్మించిన ముగ్గురు ఆడపిల్లలు

'కు.ని ఆపరేషన్ తర్వాత ఇద్దరికి జన్మ- మళ్లీ గర్భం'
మరోవైపు, బిహార్​లోని ముజఫర్​పుర్​కు చెందిన ఓ మహిళ తాను కుటుంబ నియంత్రణ ఆపరేషన్​ చేయించుకున్నాక కూడా ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చానని చెబుతోంది. తనకు గైఘాట్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో శస్త్ర చికిత్స జరిగిందని తెలిపింది. ఇప్పుడు మళ్లీ గర్భం దాల్చిన ఆమె.. కు.ని ఆపరేషన్‌ విఫలమైనందుకు సంబంధిత వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖను ఆశ్రయించినట్లు చెప్పింది.

"నాకు 20 ఏళ్ల క్రితం వివాహమైంది. పెళ్లి తర్వాత నలుగురు పిల్లలకు జన్మనిచ్చాను. ఆ తర్వాత 2015లో కు.ని ఆపరేషన్​ చేయించుకున్నాను. అక్కడికి మూడేళ్ల తర్వాత మళ్లీ గర్భం దాల్చాను. మగబిడ్డ జన్మనిచ్చాను. అప్పటి సివిల్ సర్జన్ డాక్టర్ జ్ఞాన్ శంకర్​పై ఫిర్యాదు చేశాం. 2020లో మరో ఆడబిడ్డకు జన్మనిచ్చాను. మరోసారి ఆరోగ్య శాఖ అధికారులను ఆశ్రయించాం. రూ.6000 పరిహారం ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ గర్భం దాల్చాను. అందుకే మరోసారి ఫిర్యాదు చేసేందుకు వచ్చాం. మేం కూలీపనులు చేసుకుంటూ జీవిస్తున్నాం" అని ఆ మహిళ తెలిపింది.

అయితే ఈ విషయంపై గైఘాట్‌లోని ప్రభుత్వ ఆస్పత్రి సివిల్ సర్జన్ జ్ఞాన్​ శంకర్​ స్పందించారు. ఈ విషయంపై తన వద్ద ఎలాంటి సమాచారం లేదని వెల్లడించారు. తాను 2015లో వేరే చోట సేవలందిస్తున్నట్లు చెప్పారు. కాబట్టి ఈ విషయంపై విచారణ జరుగుతోందని తెలిపారు.

ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మ.. తల్లీపిల్లలు సేఫ్​

ఒకే కాన్పులో ఐదుగురికి జన్మ.. అంతా బాలికలే.. గర్భిణీకి సాధారణ డెలివరీ

Last Updated : Dec 11, 2023, 6:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.