Woman Give Birth to Four Babies in Rajasthan : ఒకే కాన్పులో నలుగురు చిన్నారులకు జన్మనిచ్చింది ఓ మహిళ. శిశువుల్లో ఇద్దరు మగ, ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు. ప్రస్తుతం తల్లీబిడ్డలు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఈ ఘటన రాజస్థాన్‌లో ఆదివారం జరిగింది. పెళ్లైన ఐదేళ్ల తరువాత పిల్లలు పుట్టడం, అదీ నలుగురు జన్మించడం వల్ల కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ జరిగింది
టోంక్ జిల్లాలోని వజీర్‌పురా ప్రాంతానికి చెందిన కిరణ్ కన్వర్, మోహన్ సింగ్ భార్యాభర్తలు. వీరికి ఐదేళ్ల క్రితం పెళ్లి అయినా సంతానం కలగలేదు. దీంతో కొన్ని నెలల క్రితం స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు వైద్యుడిని సంప్రదించారు దంపతులు. అనంతరం భార్యభర్తలిద్దరికి పరీక్షలు నిర్వహించిన వైద్యుడు.. వారికున్న ఆరోగ్య సమస్యలను గుర్తించి చికిత్స అందించారు. దీంతో 8 నెలల క్రితం కిరణ్ కన్వర్ గర్భం దాల్చింది.
మహిళపై వైద్యుల ప్రత్యేక శ్రద్ధ..
కాగా సోనోగ్రఫీ పరీక్షల్లో కిరణ్ కన్వర్ గర్భంలో.. నాలుగు పిండాలు ఉన్నట్లు గుర్తించారు వైద్యులు. అనంతరం ఆమైపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. శనివారం రాత్రి కిరణ్ కన్వర్ పురిటి నొప్పులు రావడం వల్ల ఆసుపత్రికి తీసుకువచ్చారు కుటుంబ సభ్యులు. ఆదివారం ఉదయం మహిళకు ఆపరేషన్ చేసి పురుడు పోశారు వైద్యులు. నలుగురు చిన్నారుల్లో ముగ్గురు ప్రభుత్వ ఆసుపత్రిలోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉండగా.. ఒక్కరు మాత్రం తల్లి వద్ద ఉన్నారు.
"ఆదివారం ఉదయం మహిళకు డెలివరీ చేశాం. ఆమె ఇద్దరు మగ, ఇద్దరు ఆడబిడ్డలకు జన్మనిచ్చింది. ఆ నలుగురు చిన్నారులూ క్షేమంగానే ఉన్నారు. తల్లికూడా ఆరోగ్యంగానే ఉంది. ఒకే కాన్పులో ఇలా నలుగురు జన్మించడం చాలా అరుదు." అని డాక్టర్ షాలినీ అగర్వాల్ తెలిపారు.
ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మ.. తల్లీపిల్లలు సేఫ్..
కొద్ది రోజుల క్రితం అసోం కరింగంజ్ జిల్లాలోని బజారిచర ప్రాంతంలోని క్రిస్టియన్ మిషనరీ ఆస్పత్రిలో కూడా.. ఓ గర్భిణీ ఒకేసారి నలుగురు నవజాత శిశువులకు జన్మనిచ్చింది. వీరిలో ముగ్గురు అబ్బాయిలు కాగా.. ఒక అమ్మాయి ఉంది. పూర్తి కథనం కోసం ఇక్కడి క్లిక్ చేయండి.
Kota Suicide Prevention : ఆత్మహత్యలు ఆపడానికి హాస్టళ్లలో వలలు.. ఫ్యాన్లకు స్ప్రింగ్లు