ETV Bharat / bharat

రైలులోనే మహిళ ప్రసవం.. పండంటి బిడ్డకు జన్మ.. ఇద్దరూ సేఫ్​! - women delivry in train

Woman Gives Birth On Train : రైలులో ప్రయాణిస్తున్న ఓ మహిళ.. బోగీలోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగానే ఉన్నట్లు మహిళ భర్త తెలిపాడు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే?

Woman Gives Birth On Train
రైలులో ప్రసవించిన మహిళ
author img

By

Published : Jun 3, 2023, 7:07 PM IST

Woman Gives Birth On Train : ఓ నిండు గర్భిణీ రైలులో ప్రయాణిస్తుంది. ఒక్కసారిగా ఆమెకు పురిటినొప్పులు మొదలయ్యాయి. దీంతో అప్రమత్తమైన ఆమె భర్త.. రైల్వే అధికారులకు సమాచారం అందించాడు. రైల్వే వైద్యసేవల సిబ్బంది చురుగ్గా స్పందించి మహిళకు కంపార్ట్​మెంట్​లోనే డెలివరీ చేశారు. తల్లీబిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన కేరళలోని తిరువనంతపురం-సిల్చార్ ఎక్స్​ప్రెస్​ రైలులో గురువారం జరిగింది.

అసలేం జరిగిందంటే:
బంగాల్ రాష్ట్రం ఉత్తర దినాజ్​పుర్​కు చెందిన హన్​స్దా థెరెసా, రుబిన్ దంపతులు ఇద్దరూ కూలీ పనులు నిమిత్తం కేరళకు వలస వెళ్లారు. రుబిన్​.. తాపీ మేస్త్రీ కాగా. అతడి భార్య హన్​స్దా రోజు వారీ కూలీగా పనిచేసేది. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం హన్​స్దా థెరెసా గర్భం దాల్చింది. దీంతో రుబిన్‌ పలుమార్లు స్వగ్రామం ఉత్తర దినాజ్​పుర్​కు వెళ్లాలని అనుకున్నా.. రైలు టిక్కెట్ రిజర్వేషన్ అవ్వనందున ప్రయాణం వాయిదా పడింది. భార్య డెలివరీ తేదీ దగ్గర పడడం వల్ల గురువారం తిరువనంతపురం- సిల్చార్ ఎక్స్​ప్రెస్​లో స్వగ్రామం బయలుదేరారు దంపతులు.

రైలు బర్ధమాన్ జంక్షన్​ సమీపంలోకి చేరుకోగానే.. హన్​స్దాకు నొప్పులు రావడం వల్ల ఆమె భర్త రుబిన్ రైల్వే అధికారులతో మాట్లాడి సహాయం కోరాడు. S-12 కంపార్ట్​మెంట్​లో ఉన్న మహిళ వద్దకు చేరుకున్న రైల్వే అధికారులు.. చికిత్స ప్రారంభించి విజయవంతంగా హన్​స్దా థెరెసాకు డెలివరీ చేశారు. మానవతా దృక్పథంతో సానుకూలంగా స్పందించిన రైల్వే వైద్య సిబ్బంది పట్ల రుబిన్ సంతోషం వ్యక్తం చేశాడు. రైలులో మహిళ డెలివరీ అవ్వటం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయని రైల్వే అధికారులు తెలిపారు.

ఒకే కాన్పులో ఐదుగురికి జన్మ.. అంతా బాలికలే.. గర్భిణీకి సాధారణ డెలివరీ..
ఝార్ఖండ్​లోని రాంచీలో ఓ మహిళ ఒకే కాన్పులో ఐదుగురు శిశువులకు జన్మనిచ్చింది. గర్భం దాల్చిన ఏడు నెలలకే బిడ్డలకు జన్మనిచ్చింది. ఈ అరుదైన ప్రసవం ఈ ఏడాది మార్చ్​ రిమ్స్ ఆస్పత్రిలో జరిగింది. కాగా శిశువులంతా బాలికలే కావటం గమనార్హం. ఐదుగురు చిన్నారులకు జన్మనిచ్చిన మహిళ ఛత్రా జిల్లాలోని ఇత్కోరీ ప్రాంతంలో నివసిస్తోంది. పలు సమస్యల వల్ల ఆమెకు గర్భం దాల్చడంలో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇందుకోసం ఆమె నిరంతరం చికిత్స తీసుకుంది. చివరకు గర్భం దాల్చింది. రిమ్స్ వైద్యుడు శశి బాల సింగ్ నేతృత్వంలోని డాక్టర్ల బృందం.. గర్భిణీకి సాధారణ ప్రసవం చేసింది. ఒకే కాన్పులో ఐదుగురు జన్మించడం ఝార్ఖండ్​లో ఇదే తొలిసారి అని రిమ్స్ యాజమాన్యం వెల్లడించింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.