ETV Bharat / bharat

ఒకే కాన్పులో ముగ్గురు శిశువుల జననం..తల్లీబిడ్డలు క్షేమం

Woman Gave Birth To Three Children: ఓకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మినిచ్చింది ఓ మహిళ. ఈ అరుదైన సంఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని మీరట్​లో జరిగింది. కాగా శిశువులందరూ ఆరోగ్యంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.

Meerut latest news
Meerut latest news
author img

By

Published : Apr 16, 2022, 7:13 AM IST

Woman Gave Birth To Three Children: ఉత్తర్​ప్రదేశ్​ మీరట్​లో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. మీరట్ వైద్య కళాశాలలో ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది. దుర్గానగర్​కు చెందిన నైనా.. ఒకే కాన్పులో ముగ్గురికి జన్మనిచ్చింది. అందులో ఇద్దరు మగ, ఒక ఆడ శిశువు ఉన్నారు. ఓ బాలుడు 2 కిలోల బరువున్న బాలుడు ఆరోగ్యంగా ఉండగా తల్లికి అప్పగించారు.

woman gave birth to three children
ఒకే కాన్పులో జన్మించిన ముగ్గురు శిశువులు

మరో బాలుడు 1.9 కిలోలు, బాలిక 1.5 కిలోల బరువు ఉండటం వల్ల ఇంక్యూబేటర్​లో(ఎన్​ఐసీయూ) ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. అయితే.. ఇద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారని.. బరువు తక్కువ ఉండటం వల్లే ఎన్​ఐసీయూలో పెట్టామని చెప్పారు. త్వరలోనే పిల్లలిద్దరిని తల్లికి అప్పగిస్తామన్నారు. ఒకే సారి ముగ్గురు పిల్లలు జన్మించడం పట్ల కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. పురుడుపోసిన డాక్టర్​ అరుణ బృందాన్ని వైద్య కళాశాల ప్రిన్సిపాల్​ ఆర్​సీ గుప్తా అభినందించారు.

woman gave birth to three children
శిశువులను చూపిస్తున్న వైద్యులు

ఇదీ చదవండి: 'ఆరోగ్య భారతం.. పదేళ్లలో రికార్డు స్థాయికి వైద్యుల సంఖ్య'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.