Woman Collector in Kerala: అలపుళ జిల్లా కలెక్టర్గా డా. రేణురాజ్ను నియమించడం వల్ల రాష్ట్ర పాలన యంత్రాంగంలో కొత్త చరిత్ర సృష్టించింది కేరళ ప్రభుత్వం. రేణురాజ్ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో రాష్ట్రంలోని 14జిల్లాల్లో మహిళా జిల్లా కలెక్టర్ల సంఖ్య 10కి చేరింది. పాలనా పరంగా మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉన్న దేశంలో ఇలాంటి ఘనత అభినందనీయం!
కొట్టాయంకు చెందిన డా.రేణురాజ్.. 2014 సివిల్ సర్వీసెస్ పరీక్షలో తొలి ప్రయత్నంలోనే రెండో ర్యాంకు సాధించారు. ఆమె మెడికల్ గ్రాడ్యుయేట్ కూడా.
రేణురాజ్ కంటే ముందే కేరళలో 9జిల్లాల్లో మహిళా పాలనాధికారులున్నారు. రాష్ట్ర పరిపాలన చరిత్రలోనే ఇది రికార్డు. ప్రజానుకూల విధానాలతో సమర్థవంతమైన పాలన అందిస్తూ.. వారు ప్రసిద్ధి చెందారు.
కేరళ ప్రభుత్వం కూడా వారి ప్రతిభను గుర్తించింది. రెవెన్యూ డే సెలబ్రేషన్స్ సందర్భంగా అందించిన మూడు ఉత్తమ జిల్లా కలెక్టర్ల అవార్డులు మహిళా పాలనాధికారులకే దక్కాయి.
ఇదీ చూడండి: యంగ్ మేయర్.. యువ ఎమ్మెల్యే.. త్వరలో ఏడడుగులు!