ETV Bharat / bharat

ఇంగ్లిష్​ యాచకురాలికి విముక్తి- ఇంటికి చేరిన ఆంధ్రా మహిళ

author img

By

Published : Nov 30, 2021, 5:16 PM IST

Updated : Nov 30, 2021, 10:58 PM IST

Woman begging in English: జీవితం అనే చదరంగంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము. విధిరాత ఓ మనిషిని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళుతుందో ఊహించడం కష్టం. ఉత్తర్​ప్రదేశ్​ వారణాసి వీధుల్లో.. ఆంగ్లంలో భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగించిన ఓ ఆంధ్రా మహిళ కథ కూడా ఇదే! ఇంతకాలం ఆమె పడిన కష్టాలకు ప్రతిఫలం దక్కింది. చివరకు ఇంటికి చేరింది.

woman begging in varanasi, ఇంగ్లీషులో భిక్షాటన
'ఇంగ్లీషు భిక్షాటన' నుంచి విముక్తి.. ఇంటికి చేరిన ఆంధ్రా మహిళ
ఇంగ్లిష్​ యాచకురాలికి విముక్తి- ఇంటికి చేరిన ఆంధ్రా మహిళ

Woman begging for money: వారణాసి వీధుల్లో.. ఆంగ్లంలో భిక్షాటన చేస్తూ ఇన్నేళ్లు కాలాన్ని వెళ్లదీసిన ఆంధ్రా మహిళ జీవితంలో వెలుగు వచ్చింది. తనకు సహాయం చేయాలంటూ యాచకురాలు స్వాతి చేసిన ఓ వీడియో.. ఆమె కుటుంబసభ్యుల వరకు చేరింది. నాలుగేళ్ల తర్వాత వారందరూ కలుసుకున్నారు.

woman begging in varanasi, ఇంగ్లీషులో భిక్షాటన
అస్సీ ఘాట్​లో స్వాతి

'ప్లీజ్​.. సహాయం చేయండి..'

ఆంధ్రప్రదేశ్​ కర్నూల్​కు చెందిన స్వాతికి కొన్నేళ్ల క్రితం వివాహమైంది. ఆ తర్వాత ఆమెకు పక్షవాతం వచ్చింది. శరీరంలోని ఒక భాగం పనిచేయడం మానేసింది. ఆ విషయం తెలుసుకున్న అత్తింటివారు.. ఆమెను వెలివేశారు. ఆ బాధతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఎవరికీ చెప్పకుండా.. నాలుగేళ్ల క్రితం​ వారణాసికి వెళ్లింది. అక్కడ ప్రాణాలు వదిలితే మోక్షం వస్తుందని భావించి బలవన్మరణానికి సిద్ధపడింది.

అప్పుడే అస్సీ ఘాట్​లో ఓ వ్యక్తితో స్వాతికి పరిచయమైంది. చివరకు వారిద్దరూ వివాహం చేసుకున్నారు. వారికి ఓ ఆడబిడ్డ కూడా జన్మించింది. కానీ అనారోగ్యం కారణంగా ఆ పసికందు మరణించింది. అప్పటి నుంచి అస్సీ ఘాట్​ దగ్గరే భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగించింది స్వాతి.

ఇదీ చూడండి:- యాచించే రోజులు పోయాయ్​.. ఇంటికి చేరిన ఇంజినీర్​

woman begging in varanasi: భిక్షాటన చేసుకుంటోందని స్వాతిని తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. ఆమెకు డిగ్రీ పట్టా ఉంది. ఆంగ్లంలో భిక్షాటన చేస్తున్న స్వాతిని చూసి అక్కడి ప్రజలు, పర్యటకులు ఆశ్చర్యపోయారు. కొందరు రేషన్​, బట్టలు అందించారు.

స్వాతిని ఆదుకునేందుకు స్థానికులు కొందరు ముందుకొచ్చారు. ఆమెతో ఓ వీడియో చేసి సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. అందులో స్వాతి తన గురించి తాను చెప్పుకుంది.

"నమస్తే.. నా పేరు స్వాతి. నేను దక్షిణ భారతం నుంచి ఇక్కడకు వచ్చాను. బీఎస్​సీ కంప్యూటర్స్​ చదువుకున్నాను. నేను ఈ ఘాట్​లోనే ఉంటాను. నాకు దుకాణం పెట్టుకోవాలని ఉంది. దయచేసి మీరు సహాయం చేయండి. నాకు కొంత డబ్బులు కావాలి. దుకాణం పెట్టుకోవడానికి డబ్బులు కావాలి. నేను ఎప్పుడూ ఈ మండపంలోనే ఉంటాను. మీరు ఎప్పుడొచ్చినా.. ఇక్కడే ఉంటాను. మీరు నాకు సహాయ చేయండి. ప్లీజ్​.. హెల్ప్​ చేయండి."

-- స్వాతి, ఆంధ్రప్రదేశ్​వాసి

స్వాతి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. కొద్ది రోజులకు ఆ వీడియో.. ఆమె పుట్టింటి వరకు చేరింది. విషయం తెలుసుకున్న ఆమె కుటుంబసభ్యులు.. స్వాతిని వెతుక్కుంటూ ఉత్తర్​ప్రదేశ్​ వెళ్లారు. సోదరుడు, కుటుంబసభ్యులను చూసి స్వాతి ఆనందంలో మునిగిపోయింది. నాలుగేళ్ల తర్వాత ఆమె తన ఇంటికి చేరింది.

కుటుంబసభ్యులతో స్వాతి

స్వాతి సోదరుడు

ఇవీ చూడండి:-

Last Updated : Nov 30, 2021, 10:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.