కులాంతర వివాహం చేసుకున్నదన్న కోపంతో ఓ యువతిని ఆమె సామాజిక వర్గానికి చెందిన వారు చితకబాది గుండు కొట్టించారు. హేయమైన ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బారాబంకీ జిల్లాలో జరిగింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్టు చేశారు.
బాధితురాలి తల్లిదండ్రులు చాలా ఏళ్ల క్రితమే మరణించారు. అంతకుముందు నుంచే ఆ యువతి, యువకులు కలిసి ఉంటున్నారు. జూన్ 20న వారిద్దరు ఓ గుడిలో పెళ్లి చేసుకుని..శిథిలమైన గ్రామపంచాయతీ కార్యాలయంలో ఉంటున్నారు. వేరే కులం వ్యక్తిని పెళ్లి చేసుకుందనే కోపంతో.. ఆ యువతిని అపహరించి.. ఆపై దాడి చేశారు ఆమె బంధవులు, సామాజిక వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు.
ఇదీ చదవండి: 'కులాంతర వివాహం చేసుకున్నందుకు కుల బహిష్కరణ చేశారు'