మహారాష్ట్ర అమరావతికి చెందిన గోదాభాయికి షాక్ ఇచ్చింది ఆ రాష్ట్ర విద్యుత్‌శాఖ. సుమారు రూ. 29 వేలు కరెంట్ బిల్లు చేతికిచ్చి కట్టమన్నారు అధికారులు. కట్టకపోతే కనెక్షన్ తొలిగిస్తామని హెచ్చరించారు. "నా ఆదాయమే వేయి రూపాయిలు అయితే అంత మొత్తం ఎక్కడ నుంచి తెచ్చి కట్టాలి" అని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది గోదాభాయి.
"సాధారణంగా మాకు నెలకు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయిల వరకు కరెంటు బిల్లు వస్తుంది. కానీ ఇటీవల అధికారులు పంపిన బిల్లు చూసి ఆశ్చర్యపోయాను. ఏడు నెలలకు గానూ 28,800 బిల్లును పంపారు. అంటే నెలకు నాలుగు వేలకు పైనే. కరోనా ముందు నాకు నాలుగు ఇళ్లల్లో పని ఉండేది. కానీ ఇప్పుడు కేవలం రెండింటిలోనే చేస్తున్నాను. గతంలో వచ్చే రెండు వేలు కూడా ఇప్పుడు రావడం లేదు. కరోనా కాలంలో భోజనం చేయడానికి కూడా ఇబ్బంది పడ్డాము. అలాంటిది కరెంటు బిల్లు ఇంత వస్తే ఎలా కట్టాలి?
-గోదాభాయి, బాధితురాలు