దిల్లీ నుంచి గువాహటి వెళ్తున్న గో-ఫస్ట్ విమానం అత్యవసరంగా జైపుర్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. విమానం గాల్లో ఉండగా.. విండ్ షీల్ట్ పగలిపోవడం వల్ల అత్యవసరంగా దారి మళ్లించాల్సి వచ్చిందని డీజీసీఏ అధికారులు తెలిపారు.
రెండు రోజుల్లో మూడు.. గత రెండు రోజుల్లో గో-ఫస్ట్ విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తడం ఇది మూడో సారి. మంగళవారం.. ముంబయి నుంచి లేహ్ వెళ్తున్న విమానంలో ఇంజిన్‌లో సమస్య తలెత్తడం వల్ల అత్యవసరంగా దిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు దారి మళ్లించారు అధికారులు. అదే రోజు శ్రీనగర్-దిల్లీ ఫ్లైట్‌లోనూ ఇంజిన్‌లోనే సాంకేతిక లోపాలు బయపడటం వల్ల ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.
ఇవీ చదవండి: స్పైస్‌జెట్ విమానంలో పొగలు.. 5వేల అడుగుల ఎత్తులో.. కానీ లక్కీగా..
హడావుడిగా పాక్‌లో ల్యాండైన భారత విమానం.. హైదరాబాద్‌కు వస్తుండగా!