ETV Bharat / bharat

రైతులను వెనక్కి పంపిస్తే అలా చేస్తాం- కేంద్రానికి టికాయిత్​ వార్నింగ్​ - rakesh tikait warning to centre

దిల్లీ గాజీపుర్​, టిక్రీ సరిహద్దుల్లో (Delhi border news) బారికేడ్ల తొలగింపు నేపథ్యంలో.. భారతీయ కిసాన్​ యూనియన్​ నేత రాకేశ్​ టికాయిత్ (Rakesh tikait latest news)​ కేంద్రానికి హెచ్చరికలు పంపారు. రైతులను బలవంతంగా వెళ్లగొట్టాలని చూస్తే.. ప్రభుత్వ కార్యాలయాలను ధాన్యం మార్కెట్లుగా మారుస్తామని అన్నారు.

Tikait warns Centre
రైతులను వెనక్కిపంపిస్తే అలా చేస్తాం
author img

By

Published : Oct 31, 2021, 2:22 PM IST

రైతు సంఘం నేత రాకేశ్​ టికాయిత్ ​(Rakesh tikait latest news) సంచలన వ్యాఖ్యలు చేశారు. దిల్లీ సరిహద్దుల (Delhi border news) నుంచి రైతులను బలవంతంగా వెనక్కి పంపించాలని చూస్తే.. ప్రభుత్వ కార్యాలయాలు అన్నింటినీ ధాన్యం మార్కెట్లుగా మారుస్తామని హెచ్చరించారు.

గాజీపుర్​, టిక్రీ సరిహద్దుల్లో పోలీసులు బారికేడ్లను తొలగించిన నేపథ్యంలో భారతీయ కిసాన్​ యూనియన్​ నేత ఈ వ్యాఖ్యలు చేశారు.

''సరిహద్దుల నుంచి రైతులను బలవంతంగా తొలగించే ప్రయత్నాలు ఏమైనా జరిగినట్లయితే.. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను ధాన్యాగారాలుగా మారుస్తాం.''

- రాకేశ్​ టికాయిత్​, రైతు సంఘం నేత

అధికారులు.. జేసీబీలతో రైతు శిబిరాలను పడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిసిందని, అదే నిజమైతే పోలీస్​ స్టేషన్లు, జిల్లా కలెక్టర్ల కార్యాలయాల్లో టెంట్లు ఏర్పాటు చేసుకుంటామని టికాయిత్​ (Rakesh tikait latest news) స్పష్టం చేశారు.

ఏడాదిగా మూతపడిన దిల్లీ- ఉత్తర్​ప్రదేశ్​ సరిహద్దును(Delhi border news) అధికారులు శుక్రవారం తెరిచారు. గాజీపుర్​లోని సరిహద్దును (Barricades removed at ghazipur border) పునరుద్ధరించాలని తమకు స్పష్టమైన ఆదేశాలు అందిన నేపథ్యంలో బారికేడ్లను తొలగించినట్లు వెల్లడించారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

కేంద్రం తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా.. గతేడాది నవంబర్​ నుంచి రైతులు దిల్లీ సరిహద్దుల్లోనే శిబిరాలు ఏర్పాటు చేసుకొని నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడ పోలీసులు బారికేడ్లను(Barricades removed at ghazipur border) ఏర్పాటు చేసి రోడ్లను మూసివేశారు. కేంద్రం- రైతు సంఘాల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగినా అవి ఫలించలేదు.

ఇవీ చూడండి: 'పంటలను అమ్ముకునేందుకు పార్లమెంట్‌కు వెళ్తాం'

రైతులతో కలిసి కబడ్డీ ఆడిన రాకేశ్ టికాయిత్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.