ETV Bharat / bharat

'మే 5 తర్వాత వారికి ఉచితంగా టీకా పంపిణీ'

బంగాల్​లో మే5 నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి ఉచితంగా కరోనా టీకా పంపిణీ చేస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. మరోవైపు.. కర్ణాటక, గుజరాత్​ ప్రభుత్వాలు కూడా తమ రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన వారికి ఉచితంగా టీకా అందిస్తామని ప్రకటించాయి.

author img

By

Published : Apr 22, 2021, 9:38 PM IST

mamata benarjee
'మే 5 తర్వాత వారికి ఉచితంగా టీకా పంపిణీ'

మే 5 తర్వాత బంగాల్​లో 18 ఏళ్లు పైబడిన వారికి ఉచితంగా కరోనా టీకా పంపిణీ చేస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. తపన్​లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ఆమె ఈ మేరకు పేర్కొన్నారు.

"మే 2న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వస్తాయి. మే 5 తర్వాత నుంచి 18 ఏళ్లు పైబడిన వ్యక్తులకు మేం ఉచితంగా టీకా అందిస్తాం."

-మమతా బెనర్జీ, బంగాల్​ ముఖ్యమంత్రి

కర్ణాటకలో మే1 నుంచి..

కర్ణాటకలో 18 నుంచి 44 ఏళ్ల వయస్సు వ్యక్తులకు మే 1 నుంచి ఉచితంగా.. కొవిడ్​ టీకా అందజేస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇందుకోసం రూ.400 కోట్లతో తాము కొవిషీల్డ్​​ టీకా.. కోటి డోసులను తాము సేకరిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప పేర్కొన్నారు. ఏప్రిల్​ 28 నుంచి అర్హులైన లబ్ధిదారులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు.

గోవాలో 5 లక్షల డోసులు

తమ రాష్ట్రంలో 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్కులకు కరోనా టీకాను ఉచితంగా పంపిణీ చేస్తామని గోవా ప్రభుత్వం గురువారం ప్రకటించింది. ఇందుకోసం 5 లక్షల కొవిడ్​​​ టీకా డోసులను సీరం సంస్థ నుంచి తాము సిద్ధం చేస్తున్నామని తెలిపింది. ఈమేరకు ఆరోగ్య సేవల డైరెక్టరేట్​కు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆదనపు కార్యదర్శి వికాస్​ గౌనేకర్ లేఖ​ తెలిపారు. సీరం సంస్థ అభివృద్ధి చేసిన కొవిషీల్డ్​ టీకాను గోవా ప్రభుత్వం కొనుగోలు చేయనుందని తెలిపారు.

ఇదీ చూడండి: ప్రభుత్వ మార్గాల ద్వారానే టీకా సరఫరా: ఫైజర్‌

ఇదీ చూడండి: వైరస్​ మృత్యుఘంటికలు- ఆక్సిజన్​ అందక విలవిల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.