ETV Bharat / bharat

వలస కార్మికులకు రేషన్ ఇవ్వండి: సుప్రీం - సుప్రీంకోర్టు

లాక్​డౌన్​ కారణంగా నగరాల్లో చిక్కుకున్న వలస కార్మికుల కోసం ముఖ్యమైన ప్రాంతాల్లో సామాజిక వంటశాలలను ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. వలస కార్మికులను స్వస్థలాలకు తరలించేందుకు రవాణా సౌకర్యాలను కల్పించాలని సూచించింది.

SC
సుప్రీం కోర్టు
author img

By

Published : May 13, 2021, 5:22 PM IST

లాక్​డౌన్ కారణంగా నగరాల్లో ఇరుక్కున్న వలస కార్మికుల కోసం ముఖ్యమైన ప్రాంతాల్లో సామాజిక వంటశాలలను ఏర్పాటు చేయాలని కేంద్రంతో పాటు దిల్లీ, హరియాణా, ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వాలను సుప్రీం కోర్టు ఆదేశించింది. లాక్​డౌన్​ నేపథ్యంలో వలస కార్మికుల కోసం చేపట్టిన చర్యలు, రవాణా సౌకర్యాలు, ఆహార భద్రత తదితర అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది.

రేషన్​ ఇవ్వండి..

ఆత్మనిర్భర్​ భారత్​ పథకం కింద వారికి రేషన్​ కార్డులు అందించి.. మే నెల నుంచి వారికి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసర సరకులు అందించాలని జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్​ ఎంఆర్ షాతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

వలస కార్మికులను స్వస్థలాలకు తరలించేందుకు రవాణా సౌకర్యాలను కల్పించాలని సూచించింది.

ఇదీ చదవండి : వచ్చే వారం మార్కెట్లోకి స్పుత్నిక్​-వి టీకా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.