ETV Bharat / bharat

'మేం అధికారంలోకి వస్తే సీఏఏ మూలకే' - అసోం అసెంబ్లీ ఎన్నికలు

పౌరసత్వ సవరణ చట్టాన్ని ఒక రాజకీయాస్త్రంగా భాజపా వాడుకుంటోందని ​ఆరోపించారు కాంగ్రెస్​ నేత గౌరవ్​ గొగొయ్. అసోంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని అమలు కానీయబోమని చెప్పారు.

Gaurav Gogoi about caa
'మేం అధికారంలోకి వస్తే సీఏఏ మూలకే'
author img

By

Published : Mar 13, 2021, 7:27 AM IST

పౌరసత్వ సవరణ చట్టా(సీఏఏ)న్ని భాజపా ఒక రాజకీయ ఆయుధంగా వాడుకుంటోందని కాంగ్రెస్​ నాయకుడు, దివంగత తరుణ్​ గొగొయ్​ తనయుడు గౌరవ్​ గొగొయ్​(38) ఆరోపించారు. సమాజాన్ని విభజించడానికే దీన్ని ఉపయోగిస్తోందని అన్నారు. అసోంలో కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే దీన్ని అమలు కానీయబోమని చెప్పారు. సీఏఏను వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీం కోర్టులో వాదనలు కూడా వినిపిస్తామని తెలిపారు. అసోం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన ఓ వార్తా సంస్థతో మాట్లాడారు.

గతంలో కుదిరిన అసోం ఒప్పందంలో ఎవరు పౌరులు, ఎవరు కాదు అన్న విషయంలో స్పష్టత ఉందని, దాని ప్రకారమే చర్యలు తీసుకుంటామని గౌరవ్​ గొగొయ్ చెప్పారు. కాంగ్రెస్​ గెలిస్తే ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్నారా అని ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్​ నాయకులంతా కలిసికట్టుగా ప్రచారం చేస్తున్నామని తెలిపారు.

ఇదీ చూడండి: అభ్యర్థుల ఎంపిక కోసం నేడు భాజపా సీఈసీ భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.