ETV Bharat / bharat

'మేం గెలిస్తే బైక్​పై ట్రిపుల్​ రైడింగ్​కు అనుమతి- కుదరదంటే రైలుకు చలాన్!'

OP Rajbhar News: 'ఎన్నికల్లో మా పార్టీ గెలిచి అధికారం చేపడితే.. బైక్​పై ట్రిపుల్ రైడింగ్ నేరం కాదని ప్రకటిస్తాం. అలా కుదరదంటే రైలు, జీప్​లకు కూడా చలాన్ వేస్తాం" అని హామీ ఇచ్చారు ఓ రాజకీయ పార్టీ అధినేత. ఇంతకీ ఎవరాయన? రైలుకు చలాన్​ వేయడం వెనుక ఆయన లాజిక్ ఏంటి?

Will allow 3 people to ride a bike in UP

author img

By

Published : Feb 9, 2022, 7:45 PM IST

OP Rajbhar News: ఉత్తర్​ప్రదేశ్​ శాససనభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధాన పార్టీలన్నీ ప్రజాకర్షక హామీలతో ఓట్ల వేటను ముమ్మరం చేశాయి. ఇదే క్రమంలో ఓ చిన్న పార్టీ అధినేత.. విచిత్ర వాగ్దానంతో అందరి దృష్టిని ఆకర్షించారు. తమ పార్టీ గెలిచి, యూపీలో అధికారంలోకి వస్తే.. ట్రిపుల్ రైడింగ్ నేరం కాదని ప్రకటిస్తామని చెప్పారు.

సమాజ్​వాదీ పార్టీతో కలిసి ఎన్నికల బరిలో దిగిన సుహేల్​దేవ్​ భారతీయ సమాజ్ పార్టీ(ఎస్​బీఎస్​పీ) అధినేత ఓం ప్రకాశ్​ రాజ్​భర్ ఈ హామీ ఇచ్చారు. ట్రిపుల్​ రైడింగ్​ ఎందుకు నేరం కాదో వివరిస్తూ.. ఓ పెద్ద లాజిక్ చెప్పారు.

Will allow 3 people to ride a bike in UP
ఓం ప్రకాశ్​ రాజ్​భర్​

"రైలులో 70 సీట్లు ఉంటే 300 మంది ప్రయాణిస్తారు. కానీ రైలుకు చలాన్ వేయరు. మరి అలాంటప్పుడు బైక్​పై ముగ్గురు ప్రయాణిస్తే చలాన్ ఎందుకు వేస్తారు? ఏదైనా గ్రామంలో గొడవ జరిగిందని సమాచారం అందితే ఇద్దరు పోలీసులు బైక్​పై ఆ ఊరు వెళ్తారు. నిందితుడ్ని అదే బైక్​పై మధ్యలో కూర్చోబెట్టుకుని ముగ్గురూ కలిసి పోలీస్​ స్టేషన్​కు వస్తారు. మరి ఆ పోలీస్​కు చలాన్​ ఎందుకు వేయరు? మా ప్రభుత్వం వచ్చాక.. బైక్​పై ముగ్గురు ప్రయాణించొచ్చు. అలా కుదరదంటే జీపులు, రైళ్లకు కూడా చలాన్​లు వేస్తాం" అని వారణాసిలో వివరించారు రాజ్​భర్.

ఘాజీపుర్ జిల్లా జహూరాబాద్ నియోజకవర్గం నుంచి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు రాజ్​భర్​.

అప్పుడు మిత్రులు.. ఇప్పుడు శత్రువులు..

యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని గద్దె దింపుతానని ప్రతినబూని సమాజ్​వాదీ పార్టీ అధినేత అఖిలేశ్​తో చేతులు కలిపారు రాజ్​భర్. నిజానికి.. ఎస్​బీఎస్​పీ ఒకప్పుడు భాజపాకు మిత్రపక్షం. రాజ్​భర్​ ఉత్తర్​ప్రదేశ్​ వెనుకబడిన తరగతుల సంక్షేమం, దివ్యాంగుల సాధికారత శాఖ మంత్రిగా ఉండేవారు. అయితే.. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో భాజపాకు, ఎస్​బీఎస్​బీకి మధ్య స్నేహం దెబ్బతింది. ఎన్నికల ర్యాలీల్లో భాజపాకు, ప్రధాని నరేంద్రమోదీకి వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఓం ప్రకాశ్​. మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ముఖ్యమంత్రికి లేఖ పంపారు. అయితే అయన రాజీనామాకు అప్పట్లో ఆమోదం లభించలేదు​. కొంతకాలం తర్వాత రాజ్​భర్​పై యోగి వేటు వేశారు.

ఇవీ చూడండి: తొలిదశ పోలింగ్​కు 'యూపీ' సిద్ధం- ఆ వర్గం తీర్పే కీలకం!

'కాంగ్రెస్​ను గెలిపిస్తే రుణమాఫీ, 20లక్షల ఉద్యోగాలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.