ETV Bharat / bharat

ప్రియుడితో కలిసి భర్త హత్య.. గొయ్యి తీసి పూడ్చిపెట్టిన భార్య - గాలిపటం తీగ తగిలి బాలుడు మృతి

వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని ఓ మహిళ ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది. అనంతరం ప్రియుడి ఇంటిలో గొయ్యి తీసి పాతిపెట్టింది. ఈ అమానవీయ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో వెలుగుచూసింది. మరోవైపు, గాలిపటం తీగ తగిలి 13 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ హృదయవిదారక ఘటన పంజాబ్​లో జరిగింది.

wife killed husband with lover
హత్య కేసు నిందితులు
author img

By

Published : Nov 14, 2022, 7:33 PM IST

ఉత్తర్​ప్రదేశ్ గాజియాబాద్​లో దారుణం జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని తన ప్రియుడితో కలిసి ఓ మహిళ కట్టుకున్న భర్తనే హతమార్చింది. అనంతరం ప్రియుడి ఇంటిలో గొయ్యి తీసి భర్త మృతదేహాన్ని పాతిపెట్టేసింది. ఘటనాస్థలికి వచ్చిన పోలీసులకు తన భర్తను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని తప్పుదోవ పట్టించింది. 2018లో జరిగిందీ దారుణం. అప్పటి నుంచి పోలీసులు దర్యాప్తు చేపట్టినా ఎటువంటి ఆధారాలు లభించలేదు. ఆ తర్వాత ఈ కేసును గాజియాబాద్ క్రైమ్ బ్రాంచ్​కు అప్పగించారు. వారు ఈ కేసును ఛేదించారు.

wife killed husband with lover
పోలీసుల అదుపులో నిందితులు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు చంద్రవీర్ సింగ్​ 2018 ఆగస్టు 5న హత్యకు గురయ్యాడు. తన భర్త కిడ్నాప్​ అయ్యాడని బాధితుడి భార్య గాజియాబాద్ పోలీసులకు చెప్పడం వల్ల ఈ కేసును ఛేదించే పనిలో నిమగ్నమయ్యారు. ఎటువంటి ఆధారాలు లభించకపోవడం వల్ల గాజియాబాద్ క్రైమ్ పోలీసులకు ఈ కేసును అప్పగించారు.

.wife killed husband with lover
మృతదేహాన్ని వెలికితీస్తున్న పోలీసులు

మృతుడి భార్యను క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారించగా.. విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. తన భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసి గొయ్యిలో పూడ్చిపెట్టినట్లు నిందితురాలు ఒప్పుకుంది. హత్యానంతరం మృతుడి చేతికి ఉన్న బంగారు ఉంగరం తీయలేక.. అతడి చేతిని సైతం నరికేసినట్లు పోలీసుల ఎదుట అంగీకరించింది. బాధితుడి మృతదేహాన్ని గొయ్యిలో నుంచి వెలికితీసి.. పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు పోలీసులు. బాగా కుళ్లిన స్థితిలో మృతదేహం ఉందని తెలిపారు.

wife killed husband with lover
బాధితుడి పూడ్చిపెట్టిన గొయ్యి

గాలిపటం తీగ తగిలి..
పంజాబ్.. రూప్​నగర్​లో విషాదకర ఘటన జరిగింది. గాలిపటాలు ఎగరేయడానికి ఉపయోగించే చైనీస్​ తీగ మెడకు చుట్టుకుని 13 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. శనివారం సాయంత్రం జరిగిందీ ఘటన. తీగ మెడకు చుట్టుకోవడం వల్ల బాలుడి మెడకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఇంటికి వచ్చి గాయం గురించి బాలుడు తన నాన్నమ్మకు చెప్పాడు. వెంటనే రూప్​నగర్​లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే బాలుడి పరిస్థితి విషమించిందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం చండీగఢ్​ తరలించమని సిఫార్సు చేశారు. అక్కడి నుంచి చండీగఢ్ చేరుకునేసరికి బాలుడికి తీవ్ర రక్తస్రావమైంది. వైద్యులు చికిత్స ప్రారంభించేసరికి బాలుడు మృతి చెందాడు.

ఇవీ చదవండి: అడవిలో ప్రాణాపాయంలో యజమాని.. కాపాడిన శునకం.. ఎలాగంటే...

క్యాన్సర్​పై 'ఐరన్​మ్యాన్' IPS విజయం.. స్విమ్మింగ్, సైక్లింగ్, రన్నింగ్​లోనూ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.