Wife Attacks Husband: ఆగ్రహంతో ఊగిపోయిన ఓ మహిళ తన భర్త కన్నును తీవ్రంగా గాయపరిచిన సంఘటన మధ్యప్రదేశ్లోని ఛతర్పుర్లో జరిగింది. తీవ్ర రక్తస్రావంతో బాధితుడు ఆసుపత్రిలో చేరాడు. చికిత్స అనంతరం తేరుకుని పోలీసు స్టేషన్కు ఆశ్రయించాడు. భార్యపై ఫిర్యాదు చేశాడు.
ఇదీ జరిగింది: తనను బయటకు తీసుకెళ్లాలని హోలీ రోజున భర్తను కోరింది అతని భార్య. అయితే, ఆమెను తీసుకెళ్లకుండా టీవీ పెట్టుకుని కూర్చుండిపోయాడు. టీవీ కట్టేయాలని ఎన్నిసార్లు చెప్పినా స్పందించలేదు. తన మాటలను పెడచెవిన పెట్టాడని కోపంతో భార్య.. ఓ ఇనుప కడ్డీని భర్త కంట్లోకి దూర్చింది. దాంతో తీవ్ర రక్త స్రావమైంది. భర్తపై దాడి చేసి కోపంతో తన పుట్టింటికి వెళ్లిపోయింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.