ETV Bharat / bharat

2023లో 'నేడు' సో స్పెషల్​.. పగలు ఎక్కువ.. రాత్రి తక్కువ.. ఎందుకలా? - భారత్​లో మొదటి సూర్యోదయం జరిగే ప్రదేశం

Longest Day Of The Year 2023 : 2023 జూన్​ 21.. ఈ రోజు చాలా స్పెషల్ గురూ.. ఎందుకంటారా?. ఈ రోజు పగటి సమయం ఎక్కువగా ఉంటుంది. రాత్రి పూట తక్కువ ఉంటుంది. అదేంటి పగలు 12 గంటలు.. రాత్రి కూడా 12 గంటలే కదా అనుకుంటున్నారా?.. అయితే ఈ రోజు పగటి పూట ఎక్కువ ఉండడానికి ఓ కారణం ఉంది? అదేంటో తెలుసా?

longest day of the year 2023c
longest day of the year 2023
author img

By

Published : Jun 21, 2023, 1:37 PM IST

Longest Day Of The Year 2023 : సాధారణంగా ఒక రోజులో పగలు 12 గంటలు.. రాత్రి 12 గంటలు ఉంటాయి. అయితే జూన్​ 21న మాత్రం పగటి సమయం ఎక్కువగా ఉంటుంది. రాత్రి సమయం సాధారణ రోజులతో పోలిస్తే కాస్త తక్కువ. అందుకే 2023లో అతిపెద్ద పగటి రోజు జూన్​ 21. అసలేందుకు ఇలా జరుగుతుందో ఓ సారి తెలుసుకుందామా మరి.

జూన్ 21 గంటల 13 గంటల 7 నిమిషాల పగటి సమయం ఉంటుంది. ఈ రోజు ఉదయం సూర్యోదయం 5 గంటల 34 నిమిషాలకు అయితే.. సాయంత్రం 6.41 నిమిషాలకు సూర్యాస్తమయం అవుతుంది. భూమి ఉత్తర అర్ధగోళం సూర్యుని వైపు వంగి ఉండడం వల్ల జూన్​ 21న (బుధవారం) పగటి పూట ఎక్కువ సేపు ఉంటుంది. అందుకే రాత్రి, పగలు ఈ రోజు సమానంగా ఉండకుండా హెచ్చుతగ్గులు ఉంటాయి.

అలాగే దక్షిణ అర్ధగోళంలో ఉన్న యూకే, అమెరికా, రష్యా, కెనడా, భారత్, చైనాలో వేసవి కాలం ముగిస్తే.. అదే సమయంలో ఆస్ట్రేలియా, అర్జెంటీనా, చిలీ, న్యూజిలాండ్‌లో శీతాకాలం ప్రారంభమవుతుంది. సాధారణంగా భారత్​లో తొలి సూర్యోదయం అరుణాచల్ ప్రదేశ్​లో జరుగుతుంది. అయితే ఈ ఏడాది 21న మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో తొలి సూర్యోదయం జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

సంవత్సరంలో అతిచిన్న రోజు..
Winter Solstice 2021: డిసెంబర్ 21.. ఈ తేదీకి ఉన్న ప్రత్యేకత ఎంటో తెలుసా? ఇది సంవత్సరంలో అత్యంత చిన్న రోజు. సూర్యుడు ఉదయం 7.10 గంటల నుంచి సాయంత్రం 5.29 గంటల మధ్యే ఉంటాడు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

సోల్​స్టీస్​ అంటే..
సుదీర్ఘ రాత్రి లేదా పగలు ఉన్న రోజులను సోల్​స్టీస్​ అంటారు. ఏటా జూన్​ 21న, డిసెంబరు 21న.. రెండు సందర్భాల్లో ఈ సోల్​స్టీస్​ ఏర్పడుతుంది. లాటిన్​ భాషలోని సోల్​, సిస్​టెరీ అనే పదాల నుంచి ఈ సోల్​స్టీస్​ వచ్చింది. జూన్​లో వచ్చే దానిని సమ్మర్​ సోల్ట్​స్టిస్​, డిసెంబర్​లో ఏర్పడే దానిని వింటర్ ​సోల్ట్​స్టీస్​గా పేర్కొంటారు.

భూమి ఉత్తరధ్రువం సూర్యుడికి దూరంగా వెళ్లడం సహా సూర్యుడు మకర రేఖపైకి రావడం వల్ల ఈ పరిణామాలు సంభవిస్తాయి. యూకే, అమెరికా, భారత్, రష్యా, చైనా సహా కెనడా దేశాల్లో ఈ సోల్​స్టీస్​ ప్రభావం ఉంటుంది.
ఈ రోజు మరో ప్రత్యేకత ఏంటంటే ఇక నుంచి క్రమంగా రాత్రి సమయం తగ్గి పగలు పెరుగుతుంది. అదే విధంగా సమ్మర్​ సోల్​స్టిస్​ తర్వాత క్రమంగా పగటి సమయం తగ్గి రాత్రి సమయం పెరుగుతుంటుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.