ETV Bharat / bharat

అన్నాడీఎంకేకు అదే శాపంగా మారిందా? - తమిళనాడు రాజకీయాల్లో అన్నా డీఎంకే ఓటమి

తమిళనాట అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఘోర పరాజయానికి అనేక కారణాలు కనపడుతున్నాయి. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, మనస్పర్థలు పెరగడం వంటివి డీఎంకేకు కలిసి వచ్చినట్టు రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. శశికళ ఎఫెక్ట్​ కూడా ఎన్నికల్లో స్పష్టంగా కనపడిందని చెబుతున్నారు.

aiadmk in tamilanadu
అన్నాడీఎంకే ఓటమికి కారణాలు
author img

By

Published : May 2, 2021, 9:54 PM IST

2021 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది దిగ్గజ ఎంజీఆర్​ పేరిట ఉన్న రికార్డును తిరిగరాయాలనుకున్న అన్నాడీఎంకే ఆశలు.. ఆశలుగానే మిగిలిపోయాయి. వరుసగా మూడోసారి అధికారాన్ని చేపట్టి రాష్ట్రాన్ని పాలిద్దామనుకున్న పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. 10ఏళ్ల పాటు అధికారంలో ఉంటే.. ప్రభుత్వంపై వ్యతిరేకత ఎదురవడం సహజం. కానీ ఈ దఫా ఎన్నికలను పరిశీలిస్తే.. అన్నాడీఎంకేపై ప్రజల్లో ఏ స్థాయిలో అసంతృప్తి ఉందో విస్పష్టంగా బయటపడుతోంది. మరి అన్నాడీఎంకే ఇంత దారుణంగా ఓటమి పాలవడానికి కారణాలేంటి? ఇందులో పళనిస్వామి-పన్నీర్​సెల్వం పాత్ర ఎంత?

నాయకత్వ లేమి!

జయలలిత దూరమైనప్పటి నుంచి అన్నాడీఎంకేను నాయకత్వ లేమి సమస్య వెంటాడుతోంది. జయలలిత మరణాంతరం పగ్గాలు చేపట్టిన పళనిస్వామి.. చివరి వరకు నిలవగలరా? అన్న అనుమానం మధ్యే పాలన కొనసాగించారు. పన్నీర్ ​సెల్వంతో ఉన్న విభేదాలే ఇందుకు కారణమన్నది రాజకీయ నిపుణుల అభిప్రాయం. వీరి వల్ల పార్టీలో అంతర్గత కుమ్ములాటలు పెరిగిపోయాయని అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి.

కానీ పూర్తి స్థాయిలో ఐదేళ్ల పాలన పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు పళనిస్వామి. తాము చేసిన అభివృద్ధి ఈసారీ ఓట్లు తెచ్చిపెడుతుందని భావించారు. కానీ ప్రజలు డీఎంకే పక్షాన నిలిచారు.

శశికళ ఎఫెక్ట్​!

అన్నాడీఎంకేలో చీలికలు కూడా ఆ పార్టీకి చేటు చేశాయన చెప్పుకోవాలి. చిన్నమ్మ శశికళ పార్టీని వీడటం ప్రతికూలంగా మారింది. ఆమె అభిమానుల నుంచి పార్టీకీ వ్యతిరేకత ఎదురైంది. చివరికి.. అందరం కలిసి ముందుకు వెళదాం అని స్వయంగా శశికళ చెప్పినా.. ఫలితం దక్కలేదు.

అటు టీటీవీ దినకరన్​ విడిగా పోటీ చేయడం, విజయ్​కాంత్​ పార్టీ కూడా అన్నాడీఎంకే నుంచి దూరం జరగడం.. ప్రతికూల విషయాలు. ఇవన్నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు చీల్చిన అంశాలే.

అన్నాడీఎంకే తన ఎన్నికల మేనిఫెస్టోలో.. ఉచిత వాషింగ్‌ మెషిన్‌, కేబుల్‌ కనెక్షన్‌, రేషన్‌కార్డుదారులకు ఏడాదికి 6 సిలిండర్లు వంటి అనేక హామీలిచ్చింది. ఇవేవీ పని చేయలేదని స్పష్టంగా తెలుస్తోంది.

భాజపాతో పొత్తు!

భాజపాతో పొత్తు వ్యవహారంపై అన్నాడీఎంకేను ముప్పుతిప్పలు పెట్టే ప్రయత్నం చేసింది డీఎంకే. ఇందులో విజయం సాధించింది కూడా. సీఏఏను అమలు చేస్తామన్న భాజపాతో మైత్రి ఏంటి? అంటూ నిలదీసింది. అదే సమయంలో దేశం మొత్తం ఒకటే భాష ఉండాలన్న కమలదళం పెద్ద మాటలు.. అన్నాడీఎంకేకు ఒక రకంగా చేటు చేశాయి.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ- కేంద్రమంత్రి అమిత్​ షా ద్వయం కూడా తమిళ ప్రజల నాడిని పట్టుకోవడంలో విఫలమయ్యారని ఎన్నికల ఫలితాలను చూస్తుంటే అర్థమవుతోంది. వరుస ర్యాలీలతో ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం దక్కలేదు.

వీటన్నిటినీ ప్రచార అస్త్రాలుగా మలచుకుని ముందుకు సాగింది డీఎంకే. అదే సమయంలో కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలమైందని డీఎంకే ఆరోపించింది. వీలు చిక్కినప్పడుల్లా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టింది స్టాలిన్​ పార్టీ. చివరకు ఈపీఎస్​-ఓపీఎస్​ ద్వయాన్ని ఓడించి... అధికారం దక్కించుకుంది.

ఇదీ చూడండి: ఆయనకు తొలిసారా? వారికి తీన్మారా?

ఇదీ చూడండి: 'తమిళవాదం'పై డీఎంకే, అన్నాడీఎంకే ఏకస్వరం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.