ETV Bharat / bharat

విజయన్ 2.0: కేరళ సీపీఎంలో 'కొత్త' పొద్దు!

దేశంలోనే సీపీఎం అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కేరళ. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎల్​డీఎఫ్​ నేతృత్యంలో రెండోసారి అధికారాన్ని నిలబెట్టుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా బలమైన శక్తిగా మారింది. అయితే భవిష్యత్​లోనూ ఇదే ఉత్సాహంతో ముందుకెళ్లేందుకు ఏం చేయబోతోంది? ఇటీవల మంత్రివర్గ విస్తరణ విషయంలో సీపీఎం తీసుకున్న కీలక నిర్ణయం ఏంటి? బంగాల్​ నుంచి నేర్చుకున్న గుణపాఠం ఏమిటి? ఆరోగ్య శాఖ మాజీ మంత్రి శైలజకు మద్దతుగా ఎందుకు సోషల్​ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి?

CPM
సీపీఎం
author img

By

Published : May 19, 2021, 6:01 PM IST

Updated : May 19, 2021, 6:40 PM IST

కేరళలో మొదటి తరం సీపీఎం నాయకుడు అచ్యుతానందన్ రాజకీయాల నుంచి రిటైర్​ అయ్యారు. రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని పినరయి విజయన్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ ఇద్దరూ లేని పార్టీని రాష్ట్రంలో ఊహించడం కష్టం.

మరి కేరళలో సీపీఎంకు భవిష్యత్​లో ఎవరు నాయకత్వం వహించాలి?

ప్రస్తుతం పార్టీ శ్రేణులు, నాయకులను వేధిస్తున్న ప్రశ్న ఇది. ఈ ప్రశ్నకు సీపీఎం వద్ద జవాబు ఉన్నట్టే కనిపిస్తోంది. బంగాల్​ నేర్పిన గుణపాఠమే ఇందుకు మూలమని తెలుస్తోంది.

బంగాల్ ఏం నేర్పింది?

33 ఏళ్ల పాటు బంగాల్​ను సీపీఎం ఏకధాటిగా పాలించింది. ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ మనుగడ కష్టంగా మారింది. మమతా బెనర్జీకి దీటైన నాయకుడు లేక.. చివరకు కనుమరుగయ్యే దుస్థితికి చేరుకుంది. దీనికి కారణం నాయకత్వ లోపం. బుద్ధదేవ్​ భట్టాచార్య తర్వాత ఆ స్థాయిలో తదుపరి నాయకత్వాన్ని తయారు చేయలేకపోవడం వల్ల పార్టీకి కోలుకోలేని దెబ్బతగిలింది.

బంగాల్​ నేర్పిన పాఠాన్ని అర్థం చేసుకుని.. భవిష్యత్​ ప్రణాళికలను పకడ్బందీగా రచించుకుంటోంది కేరళ సీపీఎం. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో కొత్త నాయకత్వాన్ని తీర్చిదిద్దే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సీఎం పినరయి విజయన్ 2.0 మంత్రివర్గ కూర్పే దీన్ని స్పష్టం చేస్తోంది. తాజా కేబినెట్​లో ముఖ్యమంత్రి తప్ప.. మంత్రులందరూ కొత్తవారే కావడం గమనార్హం.

అప్పటి నుంచే...

స్థానిక సంస్థల ఎన్నికల నుంచే యువతకు పెద్దపీట వేయడం మొదలు పెట్టింది సీపీఎం. 21 ఏళ్ల ఆర్య రాజేంద్రన్‌ను తిరువనంతపురానికి మేయర్​ను చేసింది. కేరళ చరిత్రలో అతి పిన్న వయసు గల కౌన్సిలర్ ఆమెనే.

శాసనసభ ఎన్నికల విషయంలోనూ ఇంతే. థామస్ ఐసాక్, జి.సుధాకరన్ వంటి మంత్రులకు టికెట్​ ఇవ్వకుండా పక్కన పెట్టింది. వరుసగా రెండుసార్లు గెలిచిన వారినీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంచింది. ప్రజాదరణ ఉన్న నేతలను పక్కనబెట్టడంపై పార్టీ వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనా... దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముందడుగు వేసింది. ఇప్పుడు అదే తరహాలో మంత్రివర్గ కూర్పు చేపట్టింది. సీనియర్లు, యువకుల కలయికతో కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయబోతోంది కేరళలోని సీపీఎం నాయకత్వం.

ఈ నిర్ణయాన్ని చాలా మంది స్వాగతిస్తున్నా... కేకే శైలజను మంత్రివర్గం నుంచి తప్పించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్యశాఖ మంత్రిగా నిఫా, కరోనా కట్టడితోపాటు రెండో దఫా పార్టీ విజయం సాధించడానికి ఎంతో కృషి చేసిన ఆమెను ఎంతుకు పక్కన పెట్టారన్నది అందరి ప్రశ్న.

విజయన్​ తర్వాత ఆ స్థాయిలో..

ఆరోగ్య శాఖ మంత్రిగా శైలజ రాష్ట్రంలో చురకైన పాత్ర పోషించారు. సీఎం విజయన్​ తర్వాత ఆ స్థాయిలో ప్రజాదరణ ఉన్న నేత ఆమె కావడం గమనార్హం. అంతర్జాతీయ స్థాయిలో అనేక ఆరోగ సదస్సుల్లో పాల్గొని మంచి పేరు సంపాదించుకున్నారు. అంతర్జాతీయ మీడియాకు ఆమె సుపరిచితురాలు. అంతటి ఇమేజ్​ ఉన్న నాయకురాలిని మంత్రివర్గంలోకి తీసుకోకపోవడం ఆలోచించాల్సిన విషయమే.

అయితే గత కేబినెట్​లోని మంత్రులను దూరంగా ఉంచాలని నిర్ణయించినప్పుడు.. శైలజ మినహాయింపు కాదని పార్టీ ప్రకటించింది.

"శైలజతో పాటు మిగతా వారి గురించి పార్టీ​ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో ఒక వ్యక్తి(శైలజ)కి మినహాయింపు ఇవ్వలేము."

-ప్రస్తుత మంత్రి పి.రాజీవ్​

"నాకు నిరాశ లేదు. నేను సాధించినవి నా వ్యక్తిగత విజయాలు కాదు. ప్రభుత్వ సమష్టి కృషి. మంత్రివర్గంలో అందరూ మంచి పనితీరు కనబరిచారు. నేను కూడా బాగా చేయగలిగాను."

-శైలజ, ఆరోగ్య మంత్రి

కొత్త ప్రభుత్వంలో శైలజ చీఫ్​ విప్​గా​ వ్యవహరించనున్నారు.

2026లో సీఎం అభ్యర్థి మహిళేనా?

కేరళలో సీపీఎం తన విజయపరంపరను కొనసాగించాలంటే.. నాయకత్వ పటిమ కలిగిన, ప్రజాదరణ ఉన్న నేతకు బాధ్యతలు అప్పగించాల్సి ఉంటుంది. ఆ లక్షణాలు కేకే శైలజలో ఉన్నందున 2026లో ఆమె నాయకత్వంలోనే పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని ప్రచారం జరుగుతోంది.

ఇదీ చూడండి: తౌక్టే విలయం: ఆ నౌకలో 34 మంది మృతి

Last Updated : May 19, 2021, 6:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.