ETV Bharat / bharat

'ఆ నోటిఫికేషన్​తో యూజర్లపై వాట్సాప్ ఒత్తిడి!' - దిల్లీ హైకోర్టు

సామాజిక మాధ్యమ సంస్థ వాట్సాప్.. కొత్త ప్రైవసీ పాలసీని అంగీకరించేలా వినియోగదారులను ఒత్తిడి చేస్తుందని దిల్లీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది కేంద్రం. ఈ నోటిఫికేషన్లు పంపకుండా చూసేలా ఆదేశాలివ్వాలని హైకోర్టును కోరింది.

delhi HC
దిల్లీ హైకోర్టు, వాట్సాప్
author img

By

Published : Jun 3, 2021, 1:46 PM IST

కొత్త ప్రైవసీ పాలసీని ఖాతాదారులు అంగీకరించేలా వాట్సాప్ ఒత్తిడి చేస్తోందని ఆరోపిస్తూ దిల్లీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది కేంద్రం. వ్యక్తిగత సమాచార గోప్యత పరిరక్షణ బిల్లు అమలు కాకముందే తమ యూజర్లు ప్రైవసీ పాలసీని అంగీకరించేలా నిరంతరం నోటిఫికేషన్లు పంపిస్తోందని పేర్కొంది. అలా చేయకుండా నిలువరించేలా ఆదేశాలివ్వాలని హైకోర్టును కోరింది కేంద్రం.

వాట్సాప్ ప్రైవసీ పాలసీని సవాల్ చేస్తూ ఇప్పటికే పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ ప్రైవసీ పాలసీ.. గోప్యత హక్కుకు భంగం కలిగించేలా ఉందన్నది పిటిషనర్ల వాదన.

స్పష్టత ఇచ్చేశాం...

వినియోగదారుల గోప్యతకే ప్రాధాన్యం ఇస్తామని ఇప్పటికే కేంద్రానికి స్పష్టం చేసినట్లు వాట్సాప్ ప్రతినిధి తెలిపారు. కొత్తగా ఇస్తున్న నోటిఫికేషన్ల వల్ల యూజర్లకు ఎలాంటి నష్టం వాటిల్లదని పేర్కొన్నారు. రాబోయే వారాల్లో వాట్సాప్ పనితీరుపై వెనక్కి తగ్గబోమని వెల్లడించారు.

ఇదీ చదవండి:'ప్రైవసీ పాలసీ'పై వెనక్కి తగ్గిన వాట్సాప్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.