ETV Bharat / bharat

September 13 Horoscope: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? - నేటి రాశిఫలం

Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందో తెలుసుకోండి..

horoscope
horoscope
author img

By

Published : Sep 13, 2021, 4:58 AM IST

పన్నెండు రాశుల (Horoscope today) వారి సమయం ఎలా ఉండనుందో డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ వివరించారు. ఆ సంగతులు మీకోసం..

మేషం..

శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులను పూర్తిచేస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.

వృషభం..

చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పూర్తిచేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు చంచలంగా వ్యవహరిస్తారు. అర్హతకు తగిన ఫలితాలు అందుకుంటారు. చెడ్డవాళ్లు మీ పక్కన చేరి మీ అభిప్రాయాలను ప్రభావితం చేస్తారు. శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం ఉత్తమం.

మిథునం..

అనుకున్నది సాధిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అభివృద్ధి కోసం చేసే ప్రతి ప్రయత్నమూ ఫలిస్తుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అధికారుల సహకారం ఉంది. కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలుంటాయి. ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం.

కర్కాటకం..

హుషారుగా ముందుకు సాగితే సమస్యలు దరిచేరవు. బంధువులతో ఆచి తూచి వ్యవహరించాలి. అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. దేహజాడ్యం ఉంది. చంద్ర శ్లోకం చదవాలి.

సింహం..

శుభప్రదమైన కాలాన్ని గడుపుతారు. బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. సాయిబాబా వారి సచ్చరిత్ర పారాయణ శుభాన్నిస్తుంది.

కన్య..

మనసుపెట్టి పనిచేస్తే విజయం మీదే. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. శ్రమ అధికమవుతుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. దత్తాత్రేయ స్వామి ఆరాధన మంచి ఫలితాన్నిస్తుంది.

తుల..

మొదలు పెట్టిన పనుల్లో ఒకట్రెండు ఆటంకాలు ఎదురైనా పోరాడి విజయం సాధిస్తారు. పట్టుదల వదలకండి. ఆదాయానికి తగ్గ వ్యయం ఉంటుంది. దైవారాధన మానవద్దు

వృశ్చికం..

ధర్మసిద్ధి ఉంది. బాగా కష్టపడి పనిచేస్తే లక్ష్యాలు నెరవేరుతాయి. వృథా ప్రయాణాలు చేస్తారు. ఒక వార్త బాధ కలిగిస్తుంది. బంధువుల అండదండలుంటాయి. హనుమత్ ఆరాధన శుభప్రదం.

ధనస్సు..

శ్రమతో కూడిన ఫలాలున్నాయి. కీలక వ్యవహారాల్లో పెద్దలను కలుస్తారు. నిర్ణయం మీకు అనుకూలంగా వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనవసర ధనవ్యయం సూచితం. సూర్యస్తోత్రము చదివితే మంచిది

మకరం..

మంచి కాలం. కాలాన్ని మంచి పనుల కోసం వినియోగిస్తే గొప్ప ఫలితాలను అందుకుంటారు. మానసిక ఆనందాన్ని కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఒక శుభవార్త సంతోషాన్ని ఇస్తుంది. ఆంజనేయస్వామి సందర్శనం శుభప్రదం.

కుంభం..

మనోధైర్యంతో చేసే పనులు మంచినిస్తాయి. ఒక కీలక విషయంలో మీ ఆలోచనా ధోరణికి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులకు శుభకాలం నడుస్తోంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. దుర్గా దేవి సందర్శనం శుభప్రదం.

మీనం..

ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వేంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.